హిజ్రాలు కూడా మహిళే..వాళ్లను నేను ప్రేమిస్తున్నా : నటి వ్యాఖ్యలు

  • Published By: nagamani ,Published On : June 13, 2020 / 04:07 AM IST
హిజ్రాలు కూడా మహిళే..వాళ్లను నేను ప్రేమిస్తున్నా : నటి వ్యాఖ్యలు

హిజ్రాలు కూడా మహిళే..వాళ్లను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించింది హ్యారీపోట‌ర్ సిరీస్ లో నటించిన నటి బోని రైట్.  ట్రాన్స్‌జెండ‌ర్‌ల‌కు మద్దతుగా ట్విట్టర్ వేదికగా చేసుకొని ట్వీట్ చేశారు బోని రైట్.హ్యారీపోట‌ర్ సినిమా ప్రేమకు చిహ్నం అయితే ఆ అనంతమైన ప్రేమ నీతో పాటు అందరికీ ఎటువంటి బేధభావాలు లేకుండా అందచేయాల్సిందే… ఎందుకంటే ట్రాన్స్‌జెండ‌ర్‌ల‌కు కూడా మహిళలే… వారిని నేనుచాలా  ప్రేమిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో బోని రైట్ తన అభిప్రాయాన్ని తెలియచేసింది.

ఇక హ్యారీపోట‌ర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న జె.కె.రౌలింగ్ ట్రాన్స్‌జెండ‌ర్‌ల‌పై వివాదాస్పద ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై నెటిజన్లు ఆమెను ఏకిపడేశారు. అలాగే వీరితోపాటు హ్యారీపోటర్ సిరీస్ లో నటించిన కొందరు తారలు కూడా ఆమె వాదనను వ్యతిరేకిస్తూ ట్రాన్స్‌జెండ‌ర్‌ల‌కు మద్దతు తెలిపారు. కానీ ఎక్కడా ఆమె పేరు మాత్రం వాడకపోవటం గమనించాల్సిన విషయం. 

హ్యారీపోటర్ సిరీస్ నటి ఎమ్మా వాట్స‌న్ ట్రాన్స్‌జెండ‌ర్‌ల‌కు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు.అందులో ట్రాన్స్జెండర్ లకు సాధారణంగా జీవించే హక్కు ఉంది తెలిపింది. అంతేకాకుండా ట్రాన్స్ జెండర్ ల కోసం పాటుపడే సంస్థలకు తాను విరాళం కూడా అందజేస్తున్నట్లు తెలియజేసింది.