Free Flight Tickets : హాంకాంగ్ కీలక నిర్ణయం.. 5 లక్షల ఉచిత విమాన టికెట్లు
కోవిడ్ తో భారీగా నష్ట పోయిన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హాంకాంగ్ భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. పర్యాటకులను ఆకర్షించేందుకు హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 లక్షల ఉచిత విమాన టికెట్లు అందజేయనుంది.

Hong Kong
Free Flight Tickets : కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వైరస్ విజృంభణతో లక్షల సంఖ్యలో జనం మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జీవితాలు అస్తవ్యస్థమయ్యాయి. కోవిడ్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తింది. కరోనా మహమ్మారితో నష్ట పోయిన పలు దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.
ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కోవిడ్ తో భారీగా నష్ట పోయిన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హాంకాంగ్ భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. పర్యాటకులను ఆకర్షించేందుకు హాంకాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 లక్షల ఉచిత విమాన టికెట్లు అందజేయనుంది.
హలో హాంకాంగ్ పేరుతో ఉచిత విమాన టికెట్లు, ఉచిత ఓచర్లు, ప్రత్యేక ఆఫర్లు సైతం అందిస్తోంది. అదేవిధంగా లక్కీ డ్రాలు, ఒకటి కొంటే మరొకటి ఉచితం వంటి ఆఫర్లతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ ఆపర్లు మార్చి నెల వరకు అందుబాటులో ఉంటాయని ఆ దేశ అధికారులు పేర్కొన్నారు.