పెంట్ హౌస్..ధర రూ. 420 కోట్లు..!!

పెంట్ హౌస్..ధర రూ. 420 కోట్లు..!!

Most expensive penthouse rs. 420 crore : ఓ పెంట్ హౌస్ ఖరీదు రూ.420 కోట్లు..! అంటూ ఆశ్చర్యపోక మానరు. ధర ఎక్కువే గానీ ఆ పెంట్ హౌస్ లగ్జరీ కూడా అలాగే ఉంటుంది.ఒక్కసారి చూస్తే వదలాలని అనిపించదు. అలా ఉంటుంది మరి. అందుకే ఓ వ్యక్తి రూ.420 కోట్లకు కొనేసుకున్నాడు. ఇంతకీ ఇది ఎక్కడ అంటారా? హాంకాంగ్ లో.. మొత్తం ఐదు బెడ్ రూములున్న ఈ పెంట్ హౌస్ రికార్డు స్థాయికి అమ్ముడైపోయింది. ఆసియాలో ఓ అపార్ట్ మెంట్ ఇంత ధరకు అమ్ముడుకావటం ఇదే ఫస్ట్ టైమ్ కావటం విశేషం.

   

హాంకాంగ్‌లో ఐదు బెడ్‌రూములు కలిగిన ఓ పెంట్‌హౌస్ రికార్డు స్థాయిలో 59 మిలియన్ డాలర్లకు అమ్ముడైపోయింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 420 కోట్లు.

హాంకాంగ్ టైకూన్ విక్టర్ లి’స్ సీకే అస్సెట్ హోల్డింగ్స్‌కు చెందిన విలాసవంతమైన ఈ పెంట్‌హౌస్.. 21 బారెట్ రోడ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ఉంది. ఇప్పుడీ ఫ్లాట్‌లో చదరపు అడుగు రికార్డు స్థాయిలో 17,500 డాలర్లకు అమ్ముడైంది.

21 బారెట్ రోడ్ ప్రాజెక్టులోని 23వ అంతస్తులో ఉన్న ఈ పెంట్‌హౌస్ మొత్తం విస్తీర్ణం 3,378 చదరపు అడుగులు. విలాసవంతమైన సౌకర్యాలతో ఇందులో మొత్తం ఐదు బెట్‌రూములు ఇంద్రభవనంలా ఉంటాయి.


అంతేకాదు స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ టెర్రస్, మూడు పార్కింగ్ ప్లేసులతో పాటు ఇంకా ఇతర సౌకర్యాలు ఈ పెంట్ హౌస్ ప్రత్యేకతలు. ఈ పెంట్‌హౌస్‌ కొన్న వ్యక్తి పేరు మాత్రం సీక్రెట్ గానే ఉంచారు.హాంకాంగ్‌లోని మౌంట్ నికోల్సన్‌లో ఓ లగ్జరీ ఫ్లాట్ 2017లో భారీ ధరకు అమ్ముడుపోగా, ఇప్పుడా రికార్డును ఇది బద్దలుగొట్టింది.