Ice Flowers On River : నదిలో వికసించిన ‘మంచు పుష్పాలు’.. ప్రకృతి అద్భుతానికి నెటిజన్లు ఫిదా

మంచులా తెల్లగా మెరిసిపోయే పుష్పాలను చూశాం. కానీ మంచు పుష్పాలను చూశారా? శీతాకాలంలో చైనాలోనే ఓ నదిలో ‘మంచు పుష్పాలు’వికసించాయి. ఈ మంచు పుష్పాలను చూసి నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. ఈ మంచు పుష్పాలపై పడిన సూర్యకిరణాలు ఆ పుష్పాలకు మరింత అందాన్ని అద్దాయని అంటున్నారు.

Ice Flowers On River : నదిలో వికసించిన ‘మంచు పుష్పాలు’.. ప్రకృతి అద్భుతానికి నెటిజన్లు ఫిదా

Ice Flowers On Songhua River In China

Ice Flowers On Songhua River : మంచులా తెల్లగా మెరిసిపోయే పుష్పాలను చూశాం. కానీ మంచు పుష్పాలను చూశారా? అంటే చూడలేదనే అంటాం. కానీ ఈ శీతాకాలంలో చైనాలోనే ఓ నదిలో ‘మంచు పుష్పాలు’వికసించాయి. అదేంటీ మంచు పుష్పాలా? అదికూడా నదిలోనా? అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ప్రకృతి అందాల్లో ఈ మంచు పుష్పాలుగా వికసింజటం ఓ అద్భుతమనే చెప్పాలి. చైనాలోని సోంఘ్వువా అనే నదిలో విరిసిన మంచు పుష్పాల ఫోటోలను నార్వేకు చెందిన మాజీ దౌత్యాధికారి ఎరిక్ సొల్‌హీమ్ ట్విట్ట‌ర్‌లో ఈ ఫొటోల‌ను షేర్ చేయటంతో ఈ ప్రకృతి అద్భుతం వెలుగులోకి వచ్చింది. ఈ మంచు పుష్పాలను చూసి నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. ఈ మంచు పుష్పాలపై పడిన సూర్యకిరణాలు ఆ పుష్పాలకు మరింత అందాన్ని అద్దాయని అంటున్నారు.

శీతాకాలంలో కొన్ని ప్రాంతాల్లో మంచు కుర‌వ‌డం, న‌దులు గ‌డ్డ‌క‌ట్ట‌డం గురించి తెలిసిందే. మామూలే. చైనాలోని ఈశాన్య ప్రాంత‌లో ఉన్న సోంఘ్వువా అనే నదిలో కూడా నీళ్లు గడ్డ క‌ట్టాయి. న‌ది పైభాగం అంతా మంచు ప‌రుచుకుంది. న‌ది పైభాగంలో మంచు ముక్కలు అచ్చం పూల మాదిరిగా విచ్చుకున్న‌ట్టు ఏర్పడ్డాయి. ఆ ఆకృతి ఎలా ఉందంటే నిజంగానే ఆ నదిలో పువ్వులు వికసించాయా? అన్నంత సహజంగా ఉన్నాయి. ఆ మంచు పూలపై సూర్య‌కిర‌ణాలు ప‌డిన‌ప్పుడు ఆ మంచు పుష్పాలు మిరుమిట్లు గొలుపుతూ క‌నువిందు చేస్తున్నాయి.

నార్వేకు చెందిన మాజీ దౌత్యాధికారి ఎరిక్ సొల్‌హీమ్ శుక్ర‌వారం ట్విట్ట‌ర్‌లో ఈ ఫొటోల‌ను షేర్ చేయటంతో ఈ మంచు పుష్పాల ఫోటోలు సోషల్ మీడియాలో చల్లటి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఐస్ ఫ్ల‌వ‌ర్స్ అద్భుతం అంటూ అత‌ను ఆ ఫోటోల‌కు క్యాప్ష‌న్ పెట్టారు ఎరిక్ . నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నాయి అంటూ నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. ఐస్ ఫ్ల‌వ‌ర్స్ ఏర్ప‌డ‌డం అనేది వాతావ‌ర‌ణ ప‌రిస్థితులను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుందని శీతాకాలం మొద‌ట్లో ఉద‌యం పూట ఈ పూలు ఏర్ప‌డ‌తాయ‌ని చైనాకు చెందిన పీపుల్స్ డెయిలీ వార్తా సంస్థ తెలిపింది.