India-Australia joint military: సంయుక్త సైనిక విన్యాసాలు చేయడానికి సిద్ధమైన భారత్-ఆస్ట్రేలియా

సంయుక్త సైనిక విన్యాసాలు చేయడానికి భారత్-ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. చైనా నుంచి భారత్-ఆస్ట్రేలియాకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ విన్యాసాలు జరుగుతుండడం గమనార్హం. ‘‘ఆస్ట్రా-హింద్ 2022’’ పేరిట రేపు ఉదయం నుంచి ప్రారంభం కానున్న ఈ విన్యాసాలు వచ్చే నెల 11 వరకు కొనసాగుతాయి. ‘‘ఆస్ట్రా-హింద్’’ కింద తొలిసారి జరుగుతున్న సైనిక విన్యాసాలు ఇవి.

India-Australia joint military: సంయుక్త సైనిక విన్యాసాలు చేయడానికి సిద్ధమైన భారత్-ఆస్ట్రేలియా

India-Australia joint military: సంయుక్త సైనిక విన్యాసాలు చేయడానికి భారత్-ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. చైనా నుంచి భారత్-ఆస్ట్రేలియాకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ విన్యాసాలు జరుగుతుండడం గమనార్హం. ‘‘ఆస్ట్రా-హింద్ 2022’’ పేరిట రేపు ఉదయం నుంచి ప్రారంభం కానున్న ఈ విన్యాసాలు వచ్చే నెల 11 వరకు కొనసాగుతాయి. ‘‘ఆస్ట్రా-హింద్’’ కింద తొలిసారి జరుగుతున్న సైనిక విన్యాసాలు ఇవి. రాజస్థాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఈ విన్యాసాలు జరుగుతాయి.

భారత్-ఆస్ట్రేలియా మధ్య సైనిక సత్సంబంధాలు మరింత బలపడడానికి, ఇరు దేశాలు కలిసి తమ సైనిక సామర్థ్యాన్ని సమర్థంగా వినియోగించుకునే సన్నద్ధం కావడానికి ఈ విన్యాసాలు ఉపయోగపడతాయని కేంద్ర రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి విన్యాసాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఆస్ట్రేలియా ఆర్మీకి చెందిన 13వ బ్రిగేడ్ 2వ డివిజన్ ఆర్మీ ఇప్పటికే రాజస్థాన్ చేరుకుంది.

పలు రకాల ఆపరేషన్ల విషయంలో ఈ విన్యాసాలు జరుగుతాయని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య చాలా కాలంగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలతో చైనా పదే పదే కయ్యానికి కాలు దువ్వుతుంది.

Marburg virus: ఈ వైరస్‌ను కట్టడి చేయండి.. లేదంటే ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుంది: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

మరోవైపు, చైనాకు చెక్ పెట్టేందుకు 10 రోజుల క్రితమే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సంయుక్త నావికాదళ విన్యాసాలు ప్రారంభించాయి. ఆ విన్యాసాలు జపాన్, ఇండో-పసిఫిక్ ప్రాంత రక్షణ, స్థిరత్వం కోసం జపాన్, అంతర్జాతీయ జలాల్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు భారత్ లోనూ ఆస్ట్రేలియా విన్యాసాల్లో పాల్గొననుండడం గమనార్హం.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..