Marburg virus: ఈ వైరస్‌ను కట్టడి చేయండి.. లేదంటే ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుంది: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

ప్రపంచం కరోనా నుంచి పూర్తిగా బయటపడకముందే మానవాళికి ఇప్పుడు మరో వైరస్ భయం పట్టుకుంది. తాజాగా, దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తూ ఓ హెచ్చరిక చేసింది. సమీప భవిష్యత్తులో కొవిడ్-19కి మించి నష్ట చేకూర్చే వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందే ముప్పు ఉందని చెప్పింది. ఆ కొత్త వైరస్ పేరు మార్బర్గ్ అని, ఈ కేసులు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో కనపడుతున్నాయని వివరించింది.

Marburg virus: ఈ వైరస్‌ను కట్టడి చేయండి.. లేదంటే ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుంది: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

First Human Patient Injected With Cancer Killing Virus (1)

Marburg virus: ప్రపంచం కరోనా నుంచి పూర్తిగా బయటపడకముందే మానవాళికి ఇప్పుడు మరో వైరస్ భయం పట్టుకుంది. తాజాగా, దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తూ ఓ హెచ్చరిక చేసింది. సమీప భవిష్యత్తులో కొవిడ్-19కి మించి నష్ట చేకూర్చే వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందే ముప్పు ఉందని చెప్పింది. ఆ కొత్త వైరస్ పేరు మార్బర్గ్ అని, ఈ కేసులు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో కనపడుతున్నాయని వివరించింది.

దాని వల్ల సోకుతోన్న వ్యాధికి ప్రస్తుతం ‘డిసీజ్‌-ఎక్స్’ అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఆ వైరస్ సోకిన వారికి మెరుగైన చికిత్స అందిస్తూ దాన్ని కట్టడి చేయాలని, లేదంటే కరోనాలా విజృంభిస్తుందని చెప్పింది. ఇది ప్రపంచాన్ని వణికించిన ఎబోలా కంటే ప్రమాదకరమని పేర్కొంది. ‘డిసీజ్‌-ఎక్స్’ సోకిన వారిలో 80 శాతం మంది ప్రాణాలు కోల్పోతారని చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారిలో ఇప్పటికే రోగ నిరోధక శక్తి తగ్గిందని, ఇప్పుడు కొత్తగా డిసీజ్-ఎక్స్ సోకితే పెను ముప్పు సంభవిస్తుందని పేర్కొంది.

Read also: India vs New Zealand Match: వర్షం ఎఫెక్ట్.. న్యూజీలాండ్ వర్సెస్ టీమిండియా రెండవ వన్డే రద్దు ..

అంతేగాక, డిసీజ్-ఎక్స్‌కు ఔషధాలు, వ్యాక్సిన్లు లేవని తెలిపింది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తలు ఈ కొత్త వైరస్‌కు ఔషధాలను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. చైనాలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా సంక్షోభం నుంచి చాలా దేశాలు ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు ‘డిసీజ్‌-ఎక్స్’ విజృంభిస్తే పరిస్థితులు మరింత క్షీణిస్తాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..