Imran Khan: పాక్ ఆర్థిక వ్యవస్థ ఇండియా కంటే బెటర్‌గానే ఉంది: ఇమ్రాన్ ఖాన్

భారత ఆర్థిక వ్యవస్థ కంటే పాకిస్తాన్ బెటర్ గానే ఉందంటున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజికి ముందు ఇంటరన్నేషనల్ మానిటరీ ఫండ్ అవసరాలను తీర్చేందుకు...

Imran Khan: పాక్ ఆర్థిక వ్యవస్థ ఇండియా కంటే బెటర్‌గానే ఉంది: ఇమ్రాన్ ఖాన్

Imran Khan

Imran Khan: భారత ఆర్థిక వ్యవస్థ కంటే పాకిస్తాన్ బెటర్ గానే ఉందంటున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఈ సందర్భంగానే తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ఇమ్రాన్ మాట్లాడారు. ‘ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే భారత్ ఇప్పటికీ చీపెస్ట్ దేశంగానే ఉంది. ప్రతిపక్షాలు మమ్మల్ని అసమర్థులు అంటున్నాయి. నిజమేమిటంటే సంక్షోభాలు రాకుండా దేశాన్ని మా ప్రభుత్వం కాపాడింది’ అని అన్నారు.

ఇస్లామాబాద్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఛాంబర్స్ సదస్సు 2022 ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన పాకిస్తాన్ లోని ఆయిల్ ధరలు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుతో ఏకీభవించారు ప్రధాని.

జులై 2019లో IMFతో కుదుర్చుకున్న కార్యక్రమం ప్రకారం.. పాకిస్తాన్ ఆమెదించాల్సిన బిల్లుల్లో ఇదొకటి. ఈ బిల్లు చట్టంగా రూపొందితే బిలియన్ డాలర్లు పంపిణీ ఈజీ అవుతుంది. తద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కు స్వయం ప్రతిపత్తి వస్తుంది.

ఇది కూడా చదవండి: సీఎం జగన్ గుంటూరు పర్యటన నేడే

నేషనల్ అసెంబ్లీలో జరిగిన డిబేట్ పై ప్రతిపక్ష పార్టీ పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెబాజ్ షరీఫ్ ప్రశ్నలు గుప్పించారు. ఒక చేత్తో భిక్షం అడుగుతూ మరోవైపు అటామిక్ పవర్ సృష్టించడం ఎలా సాధ్యమవుతుంది. అధికార పార్టీ అయిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ దేశ ఆర్థిక వ్యవస్థను ముంచేసిందని షెబాజ్ అన్నారు.