AltNews: ఫ్యాక్ట్ చెకర్లు మహ్మద్ జుబైర్, ప్రతీక్ సిన్హాలకు నోబెల్ ప్రైజ్!

నోబెల్ బహుమతికి సంబంధించి నామినేట్ అయిన వారి పేర్లు, నామినేట్ చేసే వారి పేర్లు సహా ఇతర వివరాలను నోబెల్ విజేతను ప్రకటించే వరకు వెల్లడించారు. ఇక ఈ బహుమతి రేసులో జుబైర్, సిన్హాలతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‭స్కీ, ఐక్యరాజ్యసమితి శరణార్థ ఏజెన్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, రష్యా అసమ్మతివాది అలాగే పుతిన్ విమర్శకుడు అలెక్సీ నవాల్నీ పోటీలో ఉన్నారు

AltNews: ఫ్యాక్ట్ చెకర్లు మహ్మద్ జుబైర్, ప్రతీక్ సిన్హాలకు నోబెల్ ప్రైజ్!

Indian Fact Checker Duo Zubair And Sinha Contenders For Nobel Peace

AltNews: ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకులు, ఫ్యాక్ట్ చెకర్లు అయిన మహ్మద్ జుబైర్, ప్రతీక్ సిన్హాలకు నోబెల్ బహుమతి రానుందనే వార్తలు గుప్పుటమంటున్నాయి. వీరిద్దరూ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన జాబితాలో వీరి పేర్లు ఉన్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన ‘టైం’ పేర్కొంది. నోబెల్ కమిటీలోని చట్టసభ సభ్యులు, బుక్‭మేకర్ల నుంచి వచ్చిన అంచనాలు మరియు పీక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. జుబైర్, సిన్హాల పేర్లు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే వీరి ఫొటోలు పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఓస్లోలో ఉన్నట్లు తెలుస్తోంది.

2022-నోబెల్ శాంతి బహుమతి రేసులో మొత్తం 343 అభ్యర్థులు ఉన్నారు. ఇందులో 251 మంది వ్యక్తిగతమైన వారు కాగా, 92 సంస్థలు ఈ అవార్డు పోటీలో ఉన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. వాస్తవానికి నోబెల్ శాంతి బహుమతికి సంబంధించిన వివరాలేవీ బయటికి వెళ్లడించనప్పటికీ రాయిటర్స్ సర్వేలో కొన్ని వివరాలు బయటికి వచ్చాయి. రాయిటర్స్ సర్వే ప్రకారం.. బెలారసియన్ ప్రతిపక్ష నేత స్వయాట్లానా సిఖానౌస్కాయ, బ్రాడ్‭కాస్టన్ డేవిడ్ అటెన్‭బరో, పర్యావరణవేత్త గ్రెటా థన్‭బర్గ్, పోప్ ఫ్రాన్సిస్, టువాలు విదేశాంగ మంత్రి సైమన్ కోఫె, మయన్మార్ నేషనల్ యూనిటీ ప్రభుత్వం ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

నోబెల్ బహుమతికి సంబంధించి నామినేట్ అయిన వారి పేర్లు, నామినేట్ చేసే వారి పేర్లు సహా ఇతర వివరాలను నోబెల్ విజేతను ప్రకటించే వరకు వెల్లడించారు. ఇక ఈ బహుమతి రేసులో జుబైర్, సిన్హాలతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‭స్కీ, ఐక్యరాజ్యసమితి శరణార్థ ఏజెన్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, రష్యా అసమ్మతివాది అలాగే పుతిన్ విమర్శకుడు అలెక్సీ నవాల్నీ పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ బహుమతి ప్రదానోత్సవం 50వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. కాగా, ఈ ఏడాదికి సంబంధించి నోబెల్ వాంతి బహుమతి విజేతలను ఓస్లోలో అక్టోబర్ 7న స్థానిక(నార్వే) కాలమానం ప్రకారం.. ఉదయం 11 గంటలకు ప్రకటిస్తారు.

RSS chief Mohan Bhagwat: మహిళల భాగస్వామ్యం లేనిదే సమాజం అభివృద్ధి చెందదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్.. దేశంలో జనాభా పెరుగుదలపై కీలక వ్యాఖ్యలు ..