RSS chief Mohan Bhagwat: మహిళల భాగస్వామ్యం లేనిదే సమాజం అభివృద్ధి చెందదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్.. దేశంలో జనాభా పెరుగుదలపై కీలక వ్యాఖ్యలు ..

మహిళల భాగస్వామ్యం లేకపోతే సమాజం అభివృద్ధి చెందదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. విజయ దశమి ఉత్సవాల సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న జానాభాపై కీలక వ్యాఖ్యలు చేశారు.

RSS chief Mohan Bhagwat: మహిళల భాగస్వామ్యం లేనిదే సమాజం అభివృద్ధి చెందదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్.. దేశంలో జనాభా పెరుగుదలపై కీలక వ్యాఖ్యలు ..

RSS chief Mohan Bhagwat

RSS chief Mohan Bhagwat: మహిళల భాగస్వామ్యం లేకపోతే సమాజం అభివృద్ధి చెందదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. విజయ దశమి ఉత్సవాల సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్వతారోహకురాలు సంతోష్ యాదవ్‌ హాజరయ్యారు. ఆమె 1992 మే నెలలోనూ, 1993 మే నెలలోనూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అయితే.. దాదాపు వందేళ్ళ ఆరెస్సెస్ చరిత్రలో ఓ మహిళను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి.

KCR National Party: ఏపీపై కేసీఆర్ గురి..! త్వరలో భారీ బహిరంగ సభలకు ప్లాన్.. కీలక నేతలతో టచ్‌లోకి

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. మహిళల భాగస్వామ్యం లేనిదే సమాజం అభివృద్ధి చెందదని చెప్పారు. మహిళలను సాధికారులను చేయాలన్నారు. హిందూ రాష్ట్రం గురించి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో దీని గురించి చర్చ జరుగుతోందన్నారు. అయితే హిందూ అనే పదం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇతర పదాలను వాడటానికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. దీనిపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, తాము హిందూ అనే పదాన్ని వాడటం కొనసాగిస్తామని మోహన్ భగవత్ అన్నారు. భారత దేశ ఐకమత్యానికి, ప్రగతికి హాని కలిగించే శక్తులు సనాతన ధర్మానికి ఆటంకాలు సృష్టిస్తున్నాయని అన్నారు. వారు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని, అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారని, నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సమాజంలో అశాంతిని ప్రేరేపిస్తున్నారన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

దేశంలో జనాభా పెరుగుదలను ప్రస్తావిస్తూ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాకు వనరులు ఉండాలన్నారు. వనరుల నిర్మాణం జరగకుండా జనాభా పెరిగితే అది భారంగా మారుతుందని చెప్పారు. అయితే జనాభాను సంపదగా చూసే వైఖరి కూడా ఉందని చెప్పారు. ఇటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని జనాభా విధానాన్ని రూపొందించవలసిన అవసరం ఉందని మోహన్ భగవత్ పేర్కొన్నారు.