Indian-Origin Doctor: నాసా భవిష్యత్ వ్యోమగాములు.. 10మందిలో భారతీయ సంతతి వైద్యుడు

అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కల్నల్, భారతీయ సంతతికి చెందిన వైద్యుడు అనిల్ మీనన్‌తో పాటు మరో తొమ్మిది మందిని ఎంపిక చేసింది అమెరికా అంతరిక్ష సంస్థ.

Indian-Origin Doctor: నాసా భవిష్యత్ వ్యోమగాములు.. 10మందిలో భారతీయ సంతతి వైద్యుడు

Anil Menon

NASA: అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కల్నల్, భారతీయ సంతతికి చెందిన వైద్యుడు అనిల్ మీనన్‌తో పాటు మరో తొమ్మిది మందిని భవిష్యత్ మిషన్‌ల కోసం వ్యోమగాములుగా ఎంపిక చేసింది అమెరికా అంతరిక్ష సంస్థ. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా.. కొత్త అస్ట్రోనాట్ టీమ్‌ను ప్రకటించగా పది మందితో కూడిన లిస్ట్ విడుదల చేసింది.

మొత్తం 12వేల అప్లికేషన్లు రాగా, అందులోంచి పది మందిని సెలెక్ట్ చేసింది నాసా. వీళ్లంతా నాసా భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్లలో పాల్గొంటారు. ఈ శిక్షణ కార్యక్రమం రెండేళ్లపాటు సాగనుండగా.. ఈ టీమ్‌లో భారత మూలాలున్న అనీల్ మీనన్(45) ఒకరు. వచ్చే ఏడాది అనగా 2022 జనవరిలో అనీల్ నాసా ఆస్ట్రోనాట్ టీంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు.

నాసాలోని బయోడేటా ప్రకారం.. అనిల్‌ మీనన్‌.. ఉక్రెయిన్‌-భారత సంతతికి చెందిన పేరెంట్స్‌కి జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది మిన్నియాపొలిస్‌(మిన్నెసోటా)లో. 1999లో హార్వార్డ్‌ యూనివర్సిటీ నుంచి న్యూరోబయాలజీలో డిగ్రీ సాధించారు. 2009 స్టాన్‌ఫర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్‌ పూర్తి చేశారు. అనీల్ నాసా ఫ్లైట్ సర్జన్‌గా 2014 నుంచి సేవలు అందిస్తున్నారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో డిప్యూటీ క్రూ సర్జన్‌గా కూడా వ్యవహరించారు. 2018లో స్పేస్‌ఎక్స్‌(SpaceX)లో చేరిన అనీల్ కంపెనీ ఫస్ట్‌ హ్యూమన్‌ ఫ్లైట్‌ ప్రిపరేషన్‌లో భాగస్వామిగా ఉన్నాడు.

మిగిలిన వ్యోమగామి అభ్యర్థులు:
అమెరికన్ ఎయిర్ ఫోర్స్ మేజర్ మార్కోస్ బెర్రియోస్
యూఎస్ మెరైన్ corps మేజర్(రిటైర్డ్) ల్యూక్ డెలానీ
అమెరికన్ నేవీ లెఫ్ట్‌నెంట్ కమాండర్ జెస్సికా విట్నర్
అమెరికన్ నేవీ లెఫ్ట్‌నెంట్ డెనిజ్ బర్న్‌హామ్
యూఎస్ నేవీ కమాండర్ జాక్ హాత్వే
క్రిస్టోఫర్ విలియమ్స్
క్రిస్టినా బిర్చ్
ఆండ్రీ డగ్లస్