Russia – Ukraine War: చివరి దశకు ఆపరేషన్ గంగ.. హంగేరీలోని భారత ఎంబసీ కీలక ప్రకటన

యుక్రెయిన్ నుంచి ఇండియన్ విద్యార్థుల తరలింపులో భాగంగా చివరి విమానం ఆదివారం మార్చి 6న బయల్దేరనుంది. ఈ మేరకు అక్కడున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం ముఖ్యమైన సూచనలు చేసింది.

Russia – Ukraine War: చివరి దశకు ఆపరేషన్ గంగ.. హంగేరీలోని భారత ఎంబసీ కీలక ప్రకటన

Indian Students

Russia – Ukraine War: యుక్రెయిన్ నుంచి ఇండియన్ విద్యార్థుల తరలింపులో భాగంగా చివరి విమానం ఆదివారం మార్చి 6న బయల్దేరనుంది. ఈ మేరకు అక్కడున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం ముఖ్యమైన సూచనలు చేసింది. గూగుల్ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. అందులో పేరు, ఉక్రెయిన్​లోని ఏ నగరంలో ఉన్నారు? అనే తదితర అంశాలతో అత్యవసర ప్రాతిపదికన నింపాలంటూ సూచించింది.

యుక్రెయిన్​లో చిక్కుకున్న భారత పౌరులను తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్​ గంగ చివరి దశకు చేరుకుందని హంగేరిలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. చివరి విమానం బుడాపెస్ట్ నుంచి వెళ్లనున్నట్లు హంగేరిలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

రాయబార కార్యాలయం కల్పించిన సౌకర్యాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో సొంత ఖర్చులతో నివసిస్తున్న విద్యార్థులు.. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ కేంద్రానికి 10-12 గంటల మధ్య వెంటనే చేరుకోవాలని స్పష్టం చేసింది.

Read Also: రష్యా ఆధీనంలో యుక్రెయిన్ ఆర్మీ బేస్

ఇప్పటి వరకు సుమారుగా 30 వేల మంది భారతీయులు యుక్రెయిన్ వీడినట్లు సమాచారం. వారితో పాటు రెండు పిల్లులు కూడా యుక్రెయిన్ వీడి భారత్ చేరాయి….! అవును యుక్రెయిన్ నుంచి వచ్చిన ఒక విద్యార్ధి తనతోపాటు అక్కడ పెంచుకుంటున్న రెండు పెంపుడు పిల్లులను కూడా భారత్ తీసుకువచ్చాడు.

అందుకు భారత రాయబార కార్యాలయం అధికారులు అంగీకరించటంతో వారికి ధన్యవాదాలు తెలిపాడు. పిల్లులు నా జీవితం.. నేను వాటిని యుక్రెయిన్ లో వదిలి రాలేకపోయాను. ప్రతి ఒక్కరూ వారి పెంపుడు జంతువులను తమతో తిరిగి తీసుకురావాలని కోరుతున్నానని ఆ విద్యార్ధి అన్నాడు.