45,500 ఏళ్ల క్రితంనాటి అడవిపంది : ప్రపంచంలోనే అత్యంత పురాతన పెయింటింగ్ ఇది

45,500 ఏళ్ల క్రితంనాటి అడవిపంది : ప్రపంచంలోనే అత్యంత పురాతన పెయింటింగ్ ఇది

Indonesia: 45,500 years ago world’s oldest  cave painting  : ప్రపంచంలోనే అత్యంత పురాతన పెయింటింగ్ ను ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. ముదురు ఎరుపు రంగులో ఉన్న ఓ అడవిపంది పెయింటింగ్ 45వేల 500 ఏళ్ల క్రితంనాటిదనీ..అది ఆనాడే మోడ్రన్ ఆర్ట్ గా పేరు పొందిందని ఆర్కియాలజీ నిపుణులు తెలిపారు. ఇండోనేషియాలోనే ఓ గుహలో కనుగొన్న ఈ పెయింటింగ్ ప్రపంచంలోనే అత్యంత పురాతన కేవ్ పెయిటింగ్ (Oldest Cave Painting)​అని తెలిపారు. ఆ పంది పెయటింగ్ వెనుక భాగంలో రెండు చేతి ముద్రలు ఉన్నాయని తెలిపారు.

సులవేసి ద్వీపంలోని మారుమూల లోయలోని లియాంగ్ టెడాంగ్‌గే గుహలో కనుగొన్న ఓ అడవిపంది పెయింటింగ్ 45వేల 500 కిందట వేసినదని గుర్తించారు. జర్నల్ సైన్స్ అడ్వాన్స్​లో ఈ పరిశోధన గురించి వివరిస్తూ..ఆ ప్రాంతంలో తొలి మానవ మనుగడ ఎప్పుడనేది గుర్తించేందుకు ఈ పెయింటింగ్ సహాయపడుతుందని ఆర్కియాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2017లో సులవెసి అనే ద్వీపంలో దీన్ని బస్రన్ బుర్​హన్ అనే డాక్టోరల్ స్టూడెంట్ గుర్తించారని..అందులో భాగంగానే తాము ఇండోనేషియా ప్రభుత్వాన్ని సంప్రదించామని గ్రిఫిత్ యూనివర్సిటీ రైటర్ మ్యాక్సిమ్ ఆబర్ట్ తెలిపారు.

ఆ ఐలాండ్​లోని అత్యంత వెనుకబడి ప్రాంతంలోని లియాంగ్ టెండోంజ్​జే గుహ ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే రోడ్డు లేదు. కష్టంగా ఉన్న రహదారిపై కొన్ని గంటలపాటు నడిచి వెళితేనే ఆ గుహ వద్దకు చేరుకోవచ్చు. ఎటువంటి వాహనాలు ఆ దారి వెంట వెళ్లటానికి వీలులేకుండా ఉందని తెలిపారు.

ఆ గుహకు వెళ్లాలంటే కేవలం వేసవికాలంలో మాత్రమే వెళ్లగలం అనీ ఎందుకంటే వర్ష, శీతాకాలాల్లో అక్కడ విపరీతమైన నీటి ప్రవాహం ఉంటుంది. దీంతో ఆ దారి వెంట వెళ్లటానికి అస్సలు వీలు ఉండదని తెలిపారు. తాము ఎప్పుడూ పాశ్చాత్యులను (వెస్ట్రన్స్​) చూడలేదని అక్కడ నివసించే బర్గీస్ జాతికి చెందిన ప్రజలు చెప్పారని ఆర్కియాలజిస్టులు తెలిపారు.

45వేల 500ల సంవత్సరాలక్రితం నాటి అడవిపంది పెయింటింగ్ విషయానికి వస్తే..136 సెంటిమీటర్ల వెడల్పు, 54 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంది. ముదురు ఎరుపు రంగు ద్రవం వాడి వేసినట్టు గుర్తించారు. అలాగే పెయింట్​లో రెండు కొమ్ములు కూడా ఉన్నాయి. ఈ పెయింటింగ్ పైన చేతిముద్రలు కూడా ఉన్నాయి. మరో రెండు పందుల పెయింటింగ్స్ ఉన్నా అవి పాక్షికంగానే కనిపిస్తున్నాయి. స్పష్టంగా కనిపించట్లేదు. సులవెసి పందులను పదుల వేల సంవత్సరాల క్రితమే మానవులు వేటాడినట్టు పరిశోధకులు గుర్తించారు.

దీనిపై అబర్ట్​ అనే డేటింగ్ స్పెషలిస్ట్​ (కాలాన్ని అంచనా వేసే నిపుణుడు) మాట్లడుతూ.. ఈ పెయింటింగ్ 45వేల సంవత్సరాల కింద వేసిందేనని స్పష్టంచేశారు. యూరేనియం సిరీస్​ ఇస్టోప్ డేటింగ్​ సాయంతో ఈ విషయాన్ని గుర్తించామనీ తెలిపారు. కాగా..45వేల 500ల నాటిదని ప్రస్తుతం అంచనా వేస్తున్నామనీ కానీ..ఇది మరింత పురాతనమైనదై ఉండొచ్చని భావిస్తున్నామని దీనిపై ఇంకా పరిశోధనలు జరిగితే ఇంకా స్పష్టత రావచ్చని తెలిపారు.

ఈ పెయింటింగ్ వేసిన వారు ఎంతో మోడ్రన్​గా ప్రస్తుతం..మనలాగే ఆలోచించారని అబర్డ్ అన్నారు. కేవ్ పెయింటింగ్​ల ద్వారా మానవుల వలసలపై మరిన్ని పరిశోధనలు జరిగితే మరింత స్పష్టం వచ్చే అవకాశం ఉందని అన్నారు.

కాగా 65వేల సంవత్సరాక క్రితమే ఆస్ట్రేలియాన్లు ఇండోనేషియాలోని ఓ ద్వీపాన్ని దాటివెళ్లినట్టు ఆర్కియాలజిస్టులు అంచనాలు వేస్తున్నారు. అలాగే ఆ పెయింట్లపై ఉన్న ఆనవాళ్లతో డీఎన్ఏ విచ్ఛిన్నం చేయగలమని ఆర్కియాలజీ నిపుణుల బృందం నమ్ముతోంది.