International Women’s Day : భారత్-చైనా బోర్డర్ లో ఐటీబీపీ మ‌హిళా జ‌వాన్ల‌ గస్తీ..

భారత్-చైనా బోర్డర్ లో ఐటీబీపీ మ‌హిళా జ‌వాన్ల‌ గస్తీ నిర్వహిస్తున్నారు. రాత్రి పగలు అయినా విధులు నిర్వహించటానికి మేము సైతం అంటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

International Women’s Day : భారత్-చైనా బోర్డర్ లో ఐటీబీపీ మ‌హిళా జ‌వాన్ల‌ గస్తీ..

International Women's Day

International Women’s Day  2022:దేశ ర‌క్ష‌ణ‌లో మ‌హిళ‌లు ‘మేము సైతం’అంటూ గస్తీ కాస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పురుషుల‌కు మేం ఏమీ తీసిపోం అని నిరూపిస్తున్నారు మ‌హిళా సైనికులు. భారత్.చైనా స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ‌లో గ‌స్తీ కాస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. దేశ రక్షణకు తాము సైతం అంటూ రాత్రీ పగలూ విధులు నిర్వహిస్తున్నారు. మహిళల భాగస్వామ్యం లేని రంగం అనేది ఈనాడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు వంట ఇంటికి మాత్రమే పరిమితమైన అతివలు ఇప్పుడు ఆకాశంలో సగం మాదేనంటున్నారు. దేశరక్షణ రంగంలో కూడా ప్రతిభ చాటుతున్నారు.

ఈరోజు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని (మార్చి 8)పుర‌స్క‌రించుకొని.. ఐటీబీపీకి చెందిన మ‌హిళా జ‌వాన్లు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ – చైనా స‌రిహ‌ద్దుల్లో పెట్రోలింగ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళా జ‌వాన్ల‌కు వుమెన్స్ డే శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.

చైనా సరిహద్దుకు సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో సరిహద్దు భద్రతలో నిమగ్నమై ఉన్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) మహిళా సైనికులు మహిళా శక్తికి అద్భుతమైన ఉదాహరణగా నిలిస్తున్నారు. సరిహద్దులోని క్లిష్ట భూభాగంలో క్లిష్ట వాతావరణ పరిస్థితులలో, దేశానికి సేవా స్ఫూర్తికి లోటు లేదు. అడవి, నది, పర్వతం ఇలా ఎక్కడ చూసినా సరిహద్దును రక్షించేందుకు ఐటీబీపీకి చెందిన ఈ మహిళా సైనికులు సిద్ధంగా ఉన్నారు.

ఐటీబీపీ మహిళా సిబ్బంది జమ్మూకశ్మీర్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు సరిహద్దులో కాపలాగా ఉన్నారు. ఇక దేశ వ్యాప్తంగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. వివిధ రంగాల్లో విశేష ప్ర‌తిభ క‌లిగిన మ‌హిళామ‌ణుల‌ను స‌న్మానించి, స‌త్క‌రిస్తున్నారు.