లాలాజలంతోనే కరోనా నిర్థారణ టెస్టుకు కిట్ తయారుచేసిన జామియా యూనివర్సిటీ

లాలాజలంతోనే కరోనా నిర్థారణ టెస్టుకు కిట్ తయారుచేసిన జామియా యూనివర్సిటీ

covid testing kit:Jamia Millia Islamia (JMI)రీసెర్చర్లు Saliva ఆధారిత టెస్టు కిట్ కనిపెట్టారు. గంటలో COVID-19 పాజిటివ్ ను నిర్థారించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని చెప్తున్నారు. మల్టీడిసిప్లినరీ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ అండ్ స్టడీస్ (MCARS)సైంటిస్టుల బృందం ఇతర ఇనిస్టిట్యూట్ ల నిపుణులతో కలిసి RNA ఫ్రీ సెలైవా డిటెక్షన్ టెక్నాలజీని కనుగొన్నారు.

ఒక వ్యక్తికి చెందిన సెలైవా శాంపుల్ ను కిట్ మీద ఉంచితే గంటలో చెప్పేయొచ్చు. అది రిజల్ట్స్ ను డిస్ ప్లే చేస్తుంది. దీనికి మొబైల్ అప్లికేషన్ కూడా లింక్ చేయాలని రీసెర్చర్లు ప్లాన్ చేస్తున్నారు. కిట్ లో రిజల్ట్ కనిపించకపోతే యాప్ ద్వారా కనుగొనవచ్చు. యాప్ రిజల్ట్స్ ను అలర్ట్ చేస్తుందని రీసెర్చర్లు అంటున్నారు.



టెక్నాలజీకి MI-SEHAT (మొబైల్ ఇంటిగ్రేటెడ్ సెన్సిటివ్ ఎస్టిమేషన్ అండ్ హై స్పెసిఫిసిటీ అప్లికేషన్ ఫర్ టెస్టింగ్) అనే పేరు పెట్టారు. దీనిని పాయింట్ ఆఫ్ కేర్ (POC) డివైజ్ తో COVID-19ను డిటెక్ట్ చేయొచ్చు. దీనిని ఇంట్లో కూడా వాడుకోవచ్చు.

టీంలో ఒకరైన డా. మోహన్ సీ జోషీ స్మార్ట్ ఫోన్ లో చూసుకునేలా ఉండే ఈ POC ప్రొటోటైప్ ను డెవలప్ చేశాం. దీని ద్వారా సింథటిక్ SARS-CoV-2 RNA సహాయంతో గంటలో రిజల్ట్స్ చెప్పేయొచ్చు. అది కూడా ఎటువంటి టెక్నికల్ ఎక్స్‌పర్ట్ సహాయం లేకుండానే.