Shinzo Abe funeral cost : క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకంటే ఎక్కువగా షింజో అబే వీడ్కోలు ఖర్చు.. అంత అవసరమా?అంటూ ప్రజల ఆగ్రహం

బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకంటే ఎక్కువగా జపాన్ మాజీ అధ్యక్షుడు..దివంగత నేత షింజో అబే వీడ్కోలు ఖర్చు ఉంది. అంత ఖర్చు అవసరమా?అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Shinzo Abe funeral cost : క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకంటే ఎక్కువగా షింజో అబే వీడ్కోలు ఖర్చు.. అంత అవసరమా?అంటూ ప్రజల ఆగ్రహం

Shinzo Abe funeral cost

Shinzo Abe state funeral cost : మాజీ ప్రధాని షింజో అబేకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించేందుకు జపాన్ సిద్ధమయింది. మంగళవారం (సెప్టెంబర్ 28,2022) జరిగే ఈ కార్యక్రయానికి భారత ప్రధాని మోదీ సహా అంతర్జాతీయ స్థాయి నేతలు హాజరు కానున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న రెండో వీడ్కోలు కార్యక్రమం ఇది. అయితే ఈ వీడ్కోలు కార్యక్రమానికి పెడుతున్న ఖర్చుపై జపాన్ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు అయిన ఖర్చు కన్నా ఎక్కువగా షింజో అబే వీడ్కోలు ఖర్చు ఉంటుందని బావిస్తున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతున్న వేళ ఇంత ఖర్చు అనవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

బ్రిటన్ ఆర్థికసంక్షోభం అంచున ఉంది. ద్ర్యవోల్బణం నాలుగు దశాబ్దాల కాలంలో తొలిసారి పదిశాతానికి చేరువయింది. ఇంధన, గ్యాస్ ధరల పెరుగుదలతో బ్రిటన్ ఇప్పటికే అల్లాడుతోంది. వచ్చే శీతాకాలం కరెంటు, గ్యాస్ ఛార్జీల భారం మోయలేక బ్రిటన్ ప్రజలు పెద్దఎత్తున పేదరికంలో కూరుకుపోతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంత సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియల కోసం ఆ దేశ ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. అయినా అక్కడి ప్రజలు ఇదేమని ప్రశ్నించలేదు. అసలు రాణి అంత్యక్రియలు ఆ స్థాయిలో జరగడమే తమకు కావాల్సింది అన్నట్టుగా ఆమెకు ఘనంగా తుదివీడ్కోలు పలికారు. తమ సమస్యలను పక్కనబెట్టి…రాణి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కానీ జపాన్‌లో పరిస్థితి దీనికి భిన్నం. సుదీర్ఘకాలం జపాన్ ప్రధానిగా ఉన్న షింజో అబేకు తుదివీడ్కోలు కోసం ఆ దేశ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రజల కోపం ఏ స్థాయిలో ఉందంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఆదరణ అమాంతం తగ్గిపోతుందేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

67 ఏళ్ల షింబో అబే జులై 7న హత్యకు గురయ్యారు. జపాన్‌లోని నారా నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న షిబోపై ఓ వ్యక్తి అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అబే చనిపోయారు. ఆయన మరణించిన రెండున్నర నెలల తర్వాత వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తోంది ప్రభుత్వం. షింజో అబేకు జపాన్‌లో విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఆరోగ్య కారణాలతో ఆయన స్వచ్ఛందంగా జపాన్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ చనిపోయేక్షణం వరకు జపాన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ప్రధానిగా ఉన్న షిగేరు యోషిదాను దేశానికి దిశానిర్దేశం చేసిన నేతగా, ఆధునిక జపాన్‌ను నిర్మించిన నాయకుడిగా అక్కడి ప్రజలు భావిస్తారు. షిగేరు తర్వాత జపాన్‌లో అంత ప్రజాదరణ పొందిన నేత షింజో అబేనే అన్నది అందరి అభిప్రాయం. అందుకు తగ్గట్టే షిగేరు తర్వాత అబే వీడ్కోలునే ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.

అయితే అబేపై ఎంత అభిమానమున్నప్పటకీ..ఆయన్ను గొప్ప నాయకుడిగా గుర్తించినప్పటికీ…వీడ్కోలు పేరుతో ప్రజల డబ్బును భారీమొత్తంలో ఖర్చుపెట్టడాన్ని జపాన్ ప్రజలు ఇష్టపడడం లేదు. ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 75శాతానికి పైగా ప్రజలు…అబే అంత్యక్రియలకు ఇంత ఖర్చుపెట్టడం అనవసరమన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. ద్రవ్యోల్బణ భారం అంతకంతకూ పెరుగుతున్న ఈ సమయంలో ఆ మొత్తాన్ని అల్పాదాయ వర్గాల కోసం ఖర్చుపెట్టాలని సూచిస్తున్నారు. మొత్తంగా వీడ్కోలు కార్యక్రమం కోసం 1.66 బిలియన్ యెన్‌లు ఖర్చు చేస్తున్నారని జపాన్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు 94 కోట్లు. ఇది ఎలిజబెత్ రాణి అంత్యక్రియలకు అయిన ఖర్చు కంటే ఎక్కువ. బ్రిటన్ రాణి అంత్యక్రియలకయిన ఖర్చు గురించి అధికారిక వివరాలేమీ లేవు. కానీ దాదాపు 71 కోట్ల ఖర్చయిఉంటుందన్న అంచనాలు వెలువడ్డాయి.

షింజోఅబే వీడ్కోలుకు అంచనావేసిన దాని కంటే ఎక్కువ ఖర్చువుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జపాన్‌లో అన్నీ అంచనాకు మించి ఖర్చులుండడమే దీనికి కారణం. జపాన్ ఒలింపిక్స్ ఖర్చు కూడా ముందుగా అంచనావేసిన దానికన్నా లక్ష కోట్లకు పైగా ఎక్కువయింది. బ్రిటన్‌లోలా ప్రభుత్వం కాకుండా అధికారిక కార్యక్రమాలను కొన్ని సంస్థలు నిర్వహిస్తుంటాయి. ఖర్చు అదుపు తప్పడానికి ఇదే కారణమని ఆరోపణలు చేస్తుంటారు జపాన్ ప్రజలు. ప్రస్తుతం అబే వీడ్కోలు కార్యక్రమ నిర్వహణ మురాయయా అనే సంస్థకు అప్పగించింది ప్రభుత్వం. అబే అధికారంలో ఉన్న సమయంలో ఏటా ఇచ్చే చెరీ బాస్లమ్ పార్టీని ఈ సంస్థే నిర్వహించేది. దీనిపై అనేక విమర్శలున్నాయి. ఇప్పుడు ఇదే సంస్థకు వీడ్కోలు కార్యక్రమ నిర్వహణ అప్పజెప్పడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అటు అబేను విపరీతంగా అభిమానించే ప్రజలున్నట్టే…ఆయన్ను వ్యతిరేరించేవారూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. అబే సంస్కరణలు ధనవంతులను మరింత ధనవంతులుగా…పేదలను నిరుపేదలుగా మార్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే అబే వీడ్కోలు కార్యక్రమానికి పెద్దమొత్తంలో ఖర్చుపెట్టడంపై వ్యతిరేకతకు కారణమన్న అభిప్రాయం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం అనుకున్నట్టుగానే ప్రియతమ నేతకు తుదివీడ్కోలు ఘనంగా పలికేందుకు సిద్ధమయింది. భారత ప్రధాని మోదీ సహా 700 మంది విదేశీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు.