బిగ్గరగా అరవొద్దు ..ప్రభుత్వం ఉత్తర్వులు

  • Published By: madhu ,Published On : August 6, 2020 / 07:40 AM IST
బిగ్గరగా అరవొద్దు ..ప్రభుత్వం ఉత్తర్వులు

ఎంజాయ్ చేయండి..బిగ్గరగా అరవొద్దు..కామ్ గా ఉండాలి అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం కరోనా ఫీవర్ నెలకొంది. గతంలో విధించిన లాక్ డౌన్ ను పలు దేశాలు ఎత్తివేశాయి. మూసివేయబడి ఉన్నవి తెరుచుకుంటున్నాయి. ఈ సందర్భంగా..పలు ప్రభుత్వాలు కండీషన్స్ పెడుతున్నాయి.



ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో కఠిన నిబందనలు పెడుతున్నాయి. ఆర్థికంగా దెబ్బతినడంతో..మళ్లీ పుంజుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. జిమ్ లు, యోగా సెంటర్లు ఓపెన్ అయినట్లే…జపాన్ లో పర్యాటక ప్రాంతాలు తెరుచుకున్నాయి. ఇందులో థీమ్స్ పార్క, ఓపేరా హౌజ్, మ్యూజియంలకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

థీమ్ పార్కులలోని రోలర్ కోస్టర్ లో రైడ్ చేసే పర్యాటకులు ఎంజాయ్ చేస్తూ..బిగ్గరగా అరుస్తుంటారు. ఇలా అరవొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇది అమలు కావడం కష్టమని భావించిన గ్రీన్ లాండ్ రిసార్ట్స్ థీమ్ పార్క్ నవ్వుతూ ఉండే స్టిక్కర్లను తీసుకొచ్చింది. వీటిని ధరించడం వల్ల..పర్యాటకులు బిగ్గరగా నవ్వుతున్న ఫీలింగ్ వస్తుందని వెల్లడిస్తోంది.