Tiruvannamalai : తిరువణ్ణామలై వద్ద సుబ్రహ్మణ్య హోమం నిర్వహించిన జపనీయులు

యజ్ఞం ఇది హిందూ సాంప్రదాయంలో చేసే ఒక శుభ క్రతువు. వివిధ దేవీ దేవతలకు, గ్రహాలకు హిందువులు యాగాలు చేస్తుంటారు. అలాంటి ఒక యజ్ఞాన్ని జపనీయులు ఇండియాలో నిర్వహంచారు.

Tiruvannamalai : తిరువణ్ణామలై వద్ద సుబ్రహ్మణ్య హోమం నిర్వహించిన జపనీయులు

Japan Yagnam

Tiruvannamalai :  యజ్ఞం ఇది హిందూ సాంప్రదాయంలో చేసే ఒక శుభ క్రతువు. వివిధ దేవీ దేవతలకు, గ్రహాలకు హిందువులు యాగాలు చేస్తుంటారు. అలాంటి ఒక యజ్ఞాన్ని జపనీయులు ఇండియాలో నిర్వహంచారు. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై సమీపంలోని దేవనాంపాటు గ్రామంలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో లోక కళ్యాణార్ధం జపనీయులు ప్రత్యేక యాగం నిర్వహించారు.

జపాన్ కు చెందిన టకాయుకీ ఓషీ నేతృత్వంలో జరిగిన ఈ ప్రత్యేక యాగానికి 10 మందికి పైగా జపాన్ దేశస్ధులు హజరయ్యారు. యాగం పూర్తయ్యాక సుబ్రహ్మణ్యస్వామి విగ్రహానికి భక్తి శ్రద్ధలతో వారు ప్రత్యేక పూజలు చేశారు. జపాన్​లో నివాసం ఉంటున్న తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈ యాగానికి పూర్తి ఏర్పాట్లు చేశారు.

సంస్కృత వేద మంత్రాలను జపనీయులు చదువుతుంటే దేవనాంపట్టు గ్రామస్తులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ఆనందానికి లోనయ్యారు. సుమారు 100 మంది గ్రామస్తులు కూడా ఈ యాగంలో పాల్గోన్నారు.