cancer Medicine : ‘మనతక్కలి’ మొక్కతో క్యాన్సర్‌ మందు..అధికారికంగా గుర్తించిన అమెరికా ఎఫ్‌డీఏ

కేరళలో ఎక్కువగా కనిపించే ‘మనతక్కలి’ మొక్కతో క్యాన్సర్‌ మందు కనిపెట్టారు శాస్త్రవేత్తలు.

cancer Medicine : ‘మనతక్కలి’ మొక్కతో క్యాన్సర్‌ మందు..అధికారికంగా గుర్తించిన అమెరికా ఎఫ్‌డీఏ

Cancer Medicine ‘manathakkali’

Updated On : November 6, 2021 / 1:15 PM IST

cancer Medicine ‘Manathakkali’ : పెరట్లో పెంచే మొక్కతో క్యాన్సర్ మహమ్మారిని ఖతం చేయొచ్చని అమెరికాకు చెందిన సైంటిస్టులు వెల్లడించారు. క్యాన్సర్ మహమ్మారి బారినపడి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది బాధపడుతున్నారు.ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి క్యాన్సర్లలో ఒకటైన కాలేయ క్యాన్సర్ కు భారత్‌లో ముఖ్యంగా కేరళలో విరివిగా కనిపించే మనతక్కలి (Black nightshade or Solanum nigrum) మొక్క కాలేయ క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగపడుతుందని అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ అధికారికంగా గుర్తించింది.

Read more : ‘Cordyceps sinensis’ : హిమాలయాల్లో పెరిగే ఈ ఫంగస్‌తో క్యాన్సర్‌కు మెడిసిన్ : ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల వెల్లడి

ఈ మొక్క ఆకుల్లో ఉండే ఆట్రోసైడ్‌-డీ అనే పదార్థం లివర్‌ క్యాన్సర్‌ మెడిసిన్స్ తయారీలో దోహదం చేస్తుందని తెలిపింది. ఆట్రోసైడ్‌-డీని మొట్టమొదటగా రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘లివర్‌ క్యాన్సర్‌ చికిత్సకు ఇప్పటివరకు ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపిన మెడిసిన్ కేవలం ఒకటే ఉంది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు తాజా ఆవిష్కరణ మరిన్ని మందుల తయారీకి ఉపయోగపడుతుంది’ అని సీనియర్‌ సైంటిస్ట్‌ రూబీ జాన్‌ ఆంటో చెప్పారు.

మనతక్కలి: ఆర్‌జిసిబి డైరెక్టర్ కనుగొన్న విషయాలు..
క్యాన్సర్ కేసులు ప్రతి సంవత్సరం 9 లక్షల కొత్తవి నమోదవుతున్నాయని..అటువంటి క్యాన్సర్లలో కాలేయ క్యాన్ర్ ప్రాణాంతక వ్యాధిగా మారిందని RGCB డైరెక్టర్ తెలిపారు.ఈ కాలేయ క్యాన్సర్ బారిని పడి ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మందిని చంపేస్తుందని అంచనా ఉందన్నారు. డాక్టర్ రూబీ, ఆమె బృందం ప్రస్తుతం దీనిపై పరిశోధనలు చేస్తున్నారని..కొవ్వు కాలేయ వ్యాధి, నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్, ఫుడ్ టాక్సిన్స్ వల్ల కలిగే కాలేయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా దాని సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారని తెలిపారు. డాక్టర్ ఎల్ రవిశంకర్ (CSIR-NIST, తిరువనంతపురం) సహకారంతో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి.

Read more : Breast Cancer Vaccine: రొమ్ము క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ..మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ షురూ..