Pak Army Chief: పాకిస్తాన్ ఆర్మీకి కొత్త బాస్.. ఆసిం మునీర్‭ను నియమిస్తున్నట్లు ప్రధాని ప్రకటన

వాస్తవానికి బజ్వా పదవీ కాలం గతంలోనే ముగిసింది. అయితే ఆయన పదవీ కాలం పలుమార్లు పొడగించారు. అలా మూడు సంవత్సరాల పాటు పొడిగించారు. అయితే నిబంధనల ప్రకారం.. పొడగింపుకు ఆయనకు మరో అవకాశం లేదు. దీంతో ఎట్టకేలకు ఈ నెల 29తో విరమణ తీసుకుంటున్నారు. అనంతరం పాకిస్తాన్ 17వ ఆర్మీ చీఫ్ గా నవంబర్ 29న అసిమ్‌ మునిర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు

Pak Army Chief: పాకిస్తాన్ ఆర్మీకి కొత్త బాస్.. ఆసిం మునీర్‭ను నియమిస్తున్నట్లు ప్రధాని ప్రకటన

Lieutenant General Asim Munir will be Pakistan's next Army chief

Pak Army Chief: పాకిస్తాన్ నూతన ఆర్మీ చీఫ్‭గా ఆసిం మునీర్ నియామకం అయ్యారు. పాకిస్తాన్ ఇంటలీజెన్స్ ఏజెన్సీలోని ఇంటర్ సర్వీసెస్ ఇంటలీజెన్స్ (ఐఎస్ఐ) విభాగంలో పని చేసిన ఆయనను తదుపరి ఆర్మీ చీఫ్‭‭గా నియమిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‭గా ఉన్న కమర్ జావేద్ బజ్వా పదవీ కాలం ఈ నెల (నవంబర్) 29తో ముగియనుంది. బజ్వా పదవీ విరమణ చేసిన అనంతరం మునీర్ బాధ్యతలు స్వీకరిస్తారు.

వాస్తవానికి బజ్వా పదవీ కాలం గతంలోనే ముగిసింది. అయితే ఆయన పదవీ కాలం పలుమార్లు పొడగించారు. అలా మూడు సంవత్సరాల పాటు పొడిగించారు. అయితే నిబంధనల ప్రకారం.. పొడగింపుకు ఆయనకు మరో అవకాశం లేదు. దీంతో ఎట్టకేలకు ఈ నెల 29తో విరమణ తీసుకుంటున్నారు. అనంతరం పాకిస్తాన్ 17వ ఆర్మీ చీఫ్ గా నవంబర్ 29న అసిమ్‌ మునిర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీజేసీఎస్‭సీ) ఛైర్మన్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా ఎంపికయ్యారు.

పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి మర్రియం ఔరంగజేబ్ ట్విట్టర్‌లో ఈ ప్రకటన చేశారు. “జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాను, రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించి లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా నియమించాలని పాకిస్తాన్ ప్రధాని మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ నిర్ణయించారు. ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రతిపాదన యొక్క సారాంశాన్ని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి పంపారు” అని ఔరంగజేబ్ పేర్కొన్నారు.

Gujarat Polls: బీజేపీ ప్రచారంలో విదేశీయులు.. ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు