lion cub wedding shoot : సింహంతో సరదాగా..ప్రీ వెడ్డింగ్ షూట్ లో పైశాచికత్వం పీక్స్..

lion cub wedding shoot : సింహంతో సరదాగా..ప్రీ వెడ్డింగ్ షూట్ లో పైశాచికత్వం పీక్స్..

Lion Cub pre wedding Shoot In Pak

lion cub Pre wedding shoot : ఈరోజుల్లో పెళ్లంటే నేటి యువత కొత్తదనం కోరుకుంటోంది. ప్రీ వెడ్డింగ్ షూటుల్లో క్రియేటివిటీ పిచ్చి పీక్స్ లోకి వెళుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూటుల్లో కొత్తదనం కాస్తా పైశాచికత్వానికి దారి తీస్తోంది. అటువంటిదే జరిగింది పాకిస్థాన్ లోని ఓ జంట తీయించుకున్న ప్రీ వెడ్డింగ్ షూటులో..ఏకంగా ఓ సింహం పిల్లలకు మత్తు మందు ఇచ్చి దాంతో ఫోటోలు తీయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది…!!

 

పెళ్లిలో కొత్తదనం కొందరు హాట్ ఎయిర్ బెల్లూన్లలో ఆకాశంలో ఎగురుతూ పెళ్లి చేసుకుంటుంటే..మరొకరు నీటి అడుగున ఈ పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లు, పెళ్లిళ్లలో దిగే ఫోటోల్లోనూ క్రియేటివిటీ ఉండాలని కోరుకుంటున్నారు. ఇలా క్రియేటివిటీ కోసం యత్నించిన ఓ పాకీస్థాన్ జంట మాత్రం దారుణానికి పాల్పడింది. తమ పెళ్లి ఫొటోలు ప్రత్యేకంగా ఉండాలనే తాపత్రయంలో ఓ మూగజీవానికి బాధకలిగిస్తున్నామని ఏమాత్రం ఆలోచించలేదు. వారి ముచ్చట వాళ్లు తీర్చుకున్నారంతే..ముద్దులొలికే ఓ సింహం కూనకు మత్తుముందు ఇచ్చి..దాన్ని పక్కన పెట్టుకుని ఫోటోలను ఫోజులిచ్చారు. పలు యాంగిల్స్ లో ఫోటోలు తీసుకుని మురిసిపోయారు. ఆ తరువాత పాపం ఆ సింహం పిల్ల పరిస్థితి ఎలా ఉందో కూడా పట్టించుకోలేదు.

Pak

పూర్తిగా స్పృహలోనూ.. లేక..సగం సగం మత్తులో ఉండగా..తన చుట్టు ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో పాపం ఆ సింహం పిల్ల ఏం చేయలేని స్థితిలో కూరుకుపోయింది.తన చుట్టు జరిగే హడావుడికి..హంగామా నరకంలా అనిపించింది. కానీ ఆ జంటకు ఇవేమీ పట్టలేదు. వారి ఆంనదంలో వాళ్లు మునిగిపోయి..తెగ సంబరపడిపోతూ ఫోటోలు దిగి నెట్టింట్లో పెట్టారు. అవికాస్తా వైరల్ అయి నెటిజన్లు భగ్గుమన్నారు.

10

కాగా ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే..పెళ్లి ఫోటోల్లో కొత్తదనం కోరుకునే జంటల కోసం లాహోర్‌లోని ఓ స్టూడియో ఇటువంటి ఏర్పాట్లు చేసిందట. ఇటువంటి వారికోసమే ఆ స్టూడియో సింహాన్ని పెంచుతోందట. ఈ విషయాలన్ని తెలిసి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మండిపడుతున్నారు. జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఆ స్టూడియోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ స్టూడియోపైను కాుండా మూగజీవాన్ని హింసిస్తూ ఫోటో షూట్ చేస్తున్న జంటను కూడా కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు.