America President Elections: అమెరికాలో బైడెన్‭కు ఎదురుగాలి.. అది నిజమే అయితే వచ్చే ఎన్నికల్లో ఓటమే

ఒక్క బైడెనే కాదు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరి అభ్యర్థిత్వం పట్ల అమెరికన్లు సముఖంగా లేరట. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఒపీనియన్ పోల్‭లో ఈ ఇద్దరు అభ్యర్థులు రెండోసారి అధ్యక్ష పోటీకి దిగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు

America President Elections: అమెరికాలో బైడెన్‭కు ఎదురుగాలి.. అది నిజమే అయితే వచ్చే ఎన్నికల్లో ఓటమే

Updated On : June 18, 2023 / 6:34 PM IST

Joe Biden: వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‭కు దేశంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో బైడెన్ పాలనకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ఓటు వేశారు. ఇదీ కాక.. ఆయనకు వయసైపోయిందని ఎక్కువ మంది అభిప్రాయపడడం విశేషం. సర్వేలో పాల్గొన్న మొత్తం ఓటర్లలో 43 శాతం మంది బెడెన్ పాలనను చెత్తగా ఉందని చెప్పారు. ఇక 9 శాతం మంది బాగాలేదని అన్నారు. కేవలం 19 శాతం మాత్రమే ఆయన పాలన బాగుందని అన్నారు. మరో 18 శాతం పరవాలేదని అన్నారు.

Uttar Pradesh : 12 కేజీల సమోసా 30 నిముషాల్లో తిని రూ.71,000 గెలుచుకోండి

బైడెన్ పట్ల డెమొక్రాట్లు మద్దతు ప్రకటించడం ప్రత్యేకం ఏమీ కాదు కానీ, బ్లాక్స్ నుంచి ఆయనకు మద్దతు పెద్ద ఎత్తున ఉండడం చర్చించుకోవాల్సిన అంశం. వాస్తవానికి ఇది ట్రంప్ టెంపరితనం వల్లే బ్లాక్స్ బైడెన్‭కు మద్దతు తెలుపుతున్నారన్న విమర్శలు అనేకం ఉన్నాయి. వాస్తవానికి అమెరికాలోని అన్ని గ్రూపుల ప్రజల నుంచి బైడెన్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన సర్వేలో కూడా ఇలాంటి వ్యతిరేకతే ఎదురైంది. రెండోసారి పోటీకి బైడెన్ వద్దంటే వద్దని ఎక్కువ మంది అమెరికన్లు తేల్చి చెప్పారు.

Mann Ki Baat: ఒక వారం ముందుగానే మోదీ ‘మన్ కీ బాత్’.. ముందుగా ఎందుకు పెట్టారంటే?

ఈ వ్యతిరేకత ఒక్క బైడెనే కాదు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరి అభ్యర్థిత్వం పట్ల అమెరికన్లు సముఖంగా లేరట. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఒపీనియన్ పోల్‭లో ఈ ఇద్దరు అభ్యర్థులు రెండోసారి అధ్యక్ష పోటీకి దిగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బైడెన్ విషయంలో ఎక్కువ మంది బైడెన్ వయసు పెరగడంపై అభ్యంతరం వ్యక్తం చేయగా.. ట్రంప్ విషయంలో ఆయన వివాదాస్పద వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం అమెరికన్ల ఓటర్ల నుంచి వస్తున్న అభిప్రాయాలే కాదు. ఇరు నేతల పార్టీల్లోని అభ్యర్థులు వెల్డిస్తున్న అభిప్రాయాలు కూడా.