Spain : అతనికి హార్ట్ ఎటాక్ వస్తే పోలీసుల్ని పిలిచారు.. కారణం ఏంటంటే?

స్పెయిన్‌లోని ఒక వ్యక్తి హోటల్‌కి వెళ్లాడు. ఫుల్లుగా తిన్నాక బిల్లు చూసి హార్ట్ ఎటాక్ వచ్చింది. రెస్టారెంట్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసారు. అదేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? చదవండి.

Spain : అతనికి హార్ట్ ఎటాక్ వస్తే పోలీసుల్ని పిలిచారు.. కారణం ఏంటంటే?

Spain

Spain : స్పెయిన్ లో ఓ వ్యక్తికి హార్ట్ ఎటాక్ వస్తే అంబులెన్స్‌ని పిలవకుండా పోలీసుల్ని పిలిచారు. కారణం ఏమై ఉంటుంది? చదవండి.

Prashanthi Harathi : అలనాటి నటి.. కూతురితో కలిసి అమెరికాలో తెలుగు సంసృతిని ప్రమోట్ చేస్తూ..

స్పెయిన్‌కి చెందిన లిథువేనియన్ అనే వ్యక్తి హోటళ్లకు వెళ్తాడు. కడుపునిండా తిన్నాక బిల్లు ఎగ్గొడతాడు. అదేంటని అడిగితే తనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు నటిస్తాడు. అలా 20 కి పైగా రెస్టారెంట్లలో నాటకం ఆడాడట. మరి అలాంటప్పుడు పోలీసుల్ని కాక అంబులెన్స్‌ని పిలుస్తారా? చెప్పండి.

లిథువేనియన్ తనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినడం అయ్యాక బిల్లు అడిగితే ఛాతిని పట్టుకుని, నేలపై పడుకుని మూర్ఛపోయినట్లు నటిస్తాడట. గత నెలలో అలికాంటేలోని ఎల్ బ్యూన్ కమర్ అనే రెస్టారెంట్‌లో 34.85 యూరోలు (రూ.3,058.69) బిల్లుకు సరిపడా ఫుడ్ లాగించేసాడు. ఇక బిల్లు చెల్లించే సమయంలో తప్పించుకోవాలనుకున్నాడు. హోటల్ రూంలో డబ్బులు ఉండిపోయాయని తెచ్చి ఇస్తానని చెప్పినా సిబ్బంది విడిచిపెట్టలేదు. అంతే గుండెపోటు డ్రామా షురూ చేసాడు.

United States : అమెరికాలో గ్రీన్ కార్డు అందకముందే 4 లక్షల మంది భారతీయులు చనిపోతారట.. కొత్త నివేదిక ఏం చెబుతోందంటే?

రెస్టారెంట్ సిబ్బంది లిథువేనియన్ డ్రామా చూసి పోలీసులకు ఫోన్ చేసారు. అప్పుడే అసలు మేటర్ తెలిసింది. అలికాంటేలోని చాలా రెస్టారెంట్లలో లిథువేనియన్ ఇదే పని చేసాడని అతను పోలీసుల దృష్టిలో ఉన్నాడని తెలిసింది. ఇక అనేక రెస్టారెంట్ యజమానులు లిథువేనియన్ పై ఉమ్మడి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారట. ఇతనికి రెండేళ్ల వరకూ జైలు శిక్ష పడవచ్చునని తెలుస్తోంది.