Donald Trump: ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్ల రీస్టోర్… రెండేళ్ల తర్వాత నిషేధం ఎత్తివేత

రెండేళ్ల తర్వాత ట్రంప్ తిరిగి వీటి ద్వారా సోషల్ మీడియాలోకి రానున్నాడు. ట్రంప్ ఖాతాల రీస్టోర్ గురించి మెటా సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల అధ్యక్షుడు నిక్ క్లెగ్ వెల్లడించాడు. రాబోయే కొద్ది వారాల్లోనే ట్రంప్ ఖాతాల్ని పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. అయితే, కొన్ని కొత్త నిబంధనలు విధిస్తామన్నారు.

Donald Trump: ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్ల రీస్టోర్… రెండేళ్ల తర్వాత నిషేధం ఎత్తివేత

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్ని తిరిగి పునరుద్ధరించనున్నట్లు ‘మెటా’ వెల్లడించింది. దీంతో రెండేళ్ల తర్వాత ట్రంప్ తిరిగి వీటి ద్వారా సోషల్ మీడియాలోకి రానున్నాడు. ట్రంప్ ఖాతాల రీస్టోర్ గురించి మెటా సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల అధ్యక్షుడు నిక్ క్లెగ్ వెల్లడించాడు.

Mahesh Babu: జక్కన్న కోసం మహేష్ పూర్తి ఫోకస్‌గా ఉన్నాడు – సుధీర్ బాబు!

రాబోయే కొద్ది వారాల్లోనే ట్రంప్ ఖాతాల్ని పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. అయితే, కొన్ని కొత్త నిబంధనలు విధిస్తామన్నారు. మరిన్ని మార్గదర్శకాలు రూపొందించి, వాటికి అంగీకరిస్తేనే ఖాతాల్ని రీస్టోర్ చేస్తామని చెప్పారు. అలాగే ఇకపై నిబంధనలు ఉల్లంఘించకుండా, ఎలాంటి అభ్యంతరకర పోస్టులు చేయకుండా ఉంటేనే ఖాతా తిరిగొస్తుంది. ఒకవేళ మళ్లీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఖాతాను రద్దు చేస్తామని నిక్ అన్నారు. ఒక నెల రోజుల నుంచి రెండేళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంది. అలాగే ఆ పోస్టును తొలగిస్తారు.

Tamilisai: తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: గవర్నర్ తమిళిసై

ఇతర వినియోగదారుల్లాగే ట్రంప్‌కు కూడా తమ కమ్యూనిటీ మార్గదర్శకాలు వర్తిస్తాయని నిక్ క్లెగ్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొన్నాడు. 2021లో అమెరికాలో జరిగిన అల్లర్ల సందర్భంగా ట్రప్ చేసిన పోస్టు నేపథ్యంలో ఆయన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్ని మెటా సంస్థ తొలగించింది. జనవరి 6, 2021 నుంచి ఆయన ఖాతాలు రద్దయ్యాయి.