Mother’s Love: కొడుకు కోసం రెండు వంతెనలు నిర్మిస్తోన్న తల్లి

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ ముందు ఏదైనా దిగదుడుపే.. కొందరు తల్లులు తమ బిడ్డల కోసం ఎవరు చేయని సాహసాలు చేస్తారు.

Mother’s Love: కొడుకు కోసం రెండు వంతెనలు నిర్మిస్తోన్న తల్లి

Mother's Love

Mother’s Love: ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ ముందు ఏదైనా దిగదుడుపే.. కొందరు తల్లులు తమ బిడ్డల కోసం ఎవరు చేయని సాహసాలు చేస్తారు. మరికొందరైతే ఊహించని బహుమతులు ఇస్తుంటారు. అయితే ఈ తల్లి ఏకంగా కుమారుడి కోసం రెండు వంతెనలనే నిర్మించతలపెట్టింది. వాటిలో ఒకటి పూర్తి కాగా, మరొకటి నిర్మాణంలో ఉంది.

వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన మిస్సెస్‌ మెంగ్‌, హెనెన్‌ ప్రావిన్స్‌ లో నివాసం ఉంటున్నారు. కొడుకు స్కూల్ కి వెళ్లివచ్చే మార్గం నిత్యం ట్రాఫక్ తో రద్దీగా ఉండటం దానికి తోడు రోడ్డుపై నీళ్లు నిండి ఉంటుండటంతో ఆమె భయపడిపోయింది. తన కుమారుడు ఈ మార్గంలో వెళ్లడం సేఫ్ కాదని అనుకుంది.

సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు వంతెన నిర్మిస్తారని భావించారు మిస్సెస్‌ మెంగ్‌. అయితే అధికారులు వంతెన నిర్మాణాకి అంగించరించేలేదు. దీంతో తానే స్వయంగా నిర్మించుకుంటానని అధికారుల అనుమతి కోరింది. దీంతో అధికారులు వంతెన నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అనుమతి రాగానే వంతెన పనులు మొదలు పెట్టింది మిస్సెస్‌ మెంగ్‌. ఒక వంతెనను పూర్తి చేసింది. తాజాగా మరో వంతెన నిర్మాణం ప్రారంభించింది.

ఈ వంతెనల నిర్మాణానికి 154,000 ఖర్చు అవుతుందని అంచనా చేశారు మిస్సెస్‌ మెంగ్‌. అంటే భారత కరెన్సీలో రూ.1.10 కోట్లు. ఇక వంతెనల విషయమై మిస్సెస్‌ మెంగ్‌ మాట్లాడుతూ తాను చచ్చిపోయేలోపు బోలెడంత డబ్బు సంపాదించాలని కానీ, నా కొడుక్కోసం తరగనంత ఆస్తి కూడబెట్టాలని కానీ నాకు లేవు. అటువంటి ఆశలు లేవు కాబట్టే ఈ పని చేశాను అని తెలిపారు. ఇది తన కొడుకు ఒక్కడికోసం కాదని పాదచారులు కూడా దీనిపై నుంచి వెళ్తారని వివరించారు. ఇక కొడుకుపై ప్రేమతో మిస్సెస్‌ మెంగ్‌ నిర్మించిన ఈ వంతెన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.