Milky Sea: తొలిసారి కెమెరా కంటపడ్డ పాల సముద్రం

దక్షిణ ఇండోనేషియాలో అరుదైన దృశ్యం కనిపించింది. శాటిలైట్ పిక్చర్లలో పాల సముద్రం ఉన్నట్లుగా గుర్తించింది. కేవలం పాల సముద్రం అనేది భ్రమ మాత్రమే కాదని నిజంగా ఉందని రుజువైంది.

Milky Sea: తొలిసారి కెమెరా కంటపడ్డ పాల సముద్రం

Milky Sea

Milky Sea: దక్షిణ ఇండోనేషియాలో అరుదైన దృశ్యం కనిపించింది. శాటిలైట్ పిక్చర్లలో పాల సముద్రం ఉన్నట్లుగా గుర్తించింది. కేవలం పాల సముద్రం అనేది భ్రమ మాత్రమే కాదని నిజంగా ఉందని రుజువైంది. ల్యూమినస్ బ్యాక్టీరియా కారణంగా నీళ్లలో మెరుపు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

యూఎస్ లోని రీసెర్చర్స్ బృందం ఆగష్టు 2019లో పాల సముద్రం గురించి పరిశోధన జరిపారు. ఆ సమయంలో విశ్వంలోనే ఒకటో రెండో సార్లు ఈ వింత చూడగలమని పేర్కొన్నారు.

బయోల్యూనెసెంట్ బ్యాక్టీరియా కారణంగా పాల సముద్రాలు ఏర్పడతాయి. ఈ బ్యాక్టీరియా ఒక దానితో మరొకటి కమ్యూనికేట్ అవుతుంటాయి. అలా సముద్ర వాతావరణ పరిస్థితుల కారణంగా మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.

Read Also: సముద్రంలో కొట్టుకొచ్చిన గాజు సీసా.. 7వేల కిలోమీటర్లు ప్రయాణించిన మెసేజ్

గతంలోనూ చాలా మంది సిబ్బంది రాత్రి సమయాల్లో నీరు మెరవడం చూశామని చెప్పారు. సైంటిఫిక్ ఎంక్వైరీలో పాల సముద్రాలు అరుదుగా ప్రకృతి కారణంగానే ఏర్పడతాయని తెలిసింది.