Message in Bottle: సముద్రంలో కొట్టుకొచ్చిన గాజు సీసా.. 7వేల కిలోమీటర్లు ప్రయాణించిన మెసేజ్

ఇంగ్లాండ్ లోని బీచ్ లో ఓ గాజు సీసాలో 21ఏళ్ల నాటి మెసేజ్ చూసి షాక్ అయ్యాడో వ్యక్తి. అట్లాంటిక్ సముద్ర తీరంలో ప్రయాణించి వెస్టిండీస్ లోని బహమాస్ అనే ప్రాంతం నుంచి ఇంగ్లాండ్ కు..

Message in Bottle: సముద్రంలో కొట్టుకొచ్చిన గాజు సీసా.. 7వేల కిలోమీటర్లు ప్రయాణించిన మెసేజ్

Meesaaege In Bottle

Message in Bottle: ఇంగ్లాండ్ లోని బీచ్ లో ఓ గాజు సీసాలో 21ఏళ్ల నాటి మెసేజ్ చూసి షాక్ అయ్యాడో వ్యక్తి. అట్లాంటిక్ సముద్ర తీరంలో ప్రయాణించి వెస్టిండీస్ లోని బహమాస్ అనే ప్రాంతం నుంచి ఇంగ్లాండ్ కు కొట్టుకొచ్చింది. అంటే దాదాపు 6వేల 983కిలోమీటర్లకు పైనే.

క్రిస్పిన్ బెంటన్ అనే వ్యక్తి.. సరదాగా ఇంగ్లాండ్ లోని పాల్మౌత్ ప్రాంతంలో క్యాజిల్ బీచ్ లో నడుస్తుండగా బాటిల్ కనిపించింది. మూతపెట్టి ఉన్న బాటిల్ లో ఏదో పేపర్ ఉన్నట్లు గమనించాడు. వాతావరణం బాగుందని నడుస్తుంటే ఏదో సీక్రెట్ కనిపించిందని భావించాడట.

సీసా మూత తీసి చదవాలని ప్రయత్నించాడు. చాలా టైట్ గా ఉండటంతో వెళ్లి మరోసారి సీసాను కడిగి వచ్చాడు. అప్పుడు తీసి చూసేసరికి అందులో ఒక మెసేజ్ కనిపించిందట అతనికి. ‘ఓహ్.. ఇందులో ఒక మెసేజ్ ఉంది’ అని ఎగ్జైట్ అయ్యానని చెప్తున్నాడు.

Read Also: అక్కడ ఇళ్లకు రెంట్ కట్టక్కర్లేదు..పెయింటింగుల సిటీలో..ఎన్నాళ్లైనా ఫ్రీగా ఉండొచ్చు

అదే సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి బెంటన్‌ను ఫొటో తీశాడు. ఇద్దరూ కలిసి ఆ పేపర్ మీద ఉన్న మెసేజ్ ను చదివారు. ‘కెనడాలో ఉండే ఓ బాలిక రాసిన లెటర్ లా అనిపించింది. బాటిల్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా సేఫ్ గా ఉంది. ఎలా అయితే బయటకు తీశాం’ అని మెసేజ్ చదివిన వ్యక్తి వెల్లడించాడు.

ఇంతకీ ఆ మెసేజ్ లో ఏముందంటే.. ‘దయచేసి కాలుష్యం పెంచకండి’ అంటూ అందులో 2001 జూన్ 21, రాత్రి 9గంటల 24నిమిషాల సమయానికి రాసినట్లు పేర్కొంది. ఇంకా అందులో ఆమె వయస్సు ఆరేళ్లు అని చెప్పడంతో స్కూల్ చదివే వయస్సు అని గ్రహించారు బెంటన్. పైగా ఈ మెసేజ్ ఎవరైనా చదివితే తనకు లెటర్ ద్వారా చదివినట్లు తెలియజేయాలని అందులో రాయడంతో బెంటన్ రిప్లే ఇచ్చేందుకు ప్రయత్నించాడు.

కాకపోతే లెటర్ లో 21ఏళ్ల క్రితం రాసిన అడ్రస్ లో ఇప్పుడు ఇండస్ట్రీయల్ ఎస్టేట్ ఉన్నట్లు తెలుసుకుని ఆగిపోయాడు.