అక్కడ ఇళ్లకు రెంట్ కట్టక్కర్లేదు..పెయింటింగుల సిటీలో..ఎన్నాళ్లైనా ఫ్రీగా ఉండొచ్చు

అక్కడ ఇళ్లకు రెంట్ కట్టక్కర్లేదు..పెయింటింగుల సిటీలో..ఎన్నాళ్లైనా ఫ్రీగా ఉండొచ్చు

USA No House Rents at Slab City: ఏదన్నా టూర్ వెళ్లితే..ఏదైనా హోటల్స్ లో దిగుతాం. లేదా..అద్దెకు ఇళ్లు దొరికితే హాయిగా దాంట్లో దిగిపోతాం. కానీ హొటల్, హౌస్, లాడ్జ్ ఏదైనా రెంట్ కట్టాల్సిందే కదూ..కానీ అమెరికా… కాలిఫోర్నియా రాష్ట్రంలోని స్లాబ్ సిటీలో మాత్రం మీరు ఎన్ని రోజులు ఉన్నా..హాయిగా రెంట్ కట్టకుండానే హాయిగా ఉండొచ్చు..పైగా మీరు ఈ ఇంట్లో ఉన్నారు కదా..కనీసం మెయింటినెన్స్ అయినా కట్టండి అని అడుగుతారు. కానీ అవేవీ కట్టనవసరం లేదు. ఒక్కరూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. పైగా ఈ సిటీలో ఎక్కడంటే అక్కడ అలరించే అందాల పెయింటింగుల్ని చూసి ఆస్వాదించవచ్చు..

అమెరికా… కాలిఫోర్నియా రాష్ట్రంలోని స్లాబ్ సిటీ. సొనోరన్ అనే ఎడారిలో ఉండే ఈ వింత ఏరియాలో 150 కుటుంబాలు ఉంటున్నాయి. అక్కడి చట్టాలు, రూల్సూ ఏమీ ఉండవు. ఎడారి మొక్కలు, చుట్టూ పర్వతాలూ ఉంటాయి. ఈ స్లాబ్ సిటీలో ఉండేవారిని ప్రభుత్వం వాళ్లను పట్టించుకోదు. కనీస వసతులైన వాటర్,కరెంట్ వంటివి కూడా కల్పించదు.

ఈ స్లాబ్ సిటీకి వెళ్లాలంటే శాండియాగో నుంచి ఈశాన్యంగా దాదాపు 240 కిలోమీటర్లు వెళ్లాలి. పేరుకి అది సిటీయే. అలాని ఇరుకు ఇరుకు రోడ్లు ఉండవు. ఇళ్లు కూడా దగ్గర దగ్గరగా ఉండవు. అక్కడక్కడా ఉంటాయి. అలా కేవలం 150 కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి. వీళ్లంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఉండేవారెవరికీ కాలిఫోర్నియా ప్రభుత్వంతో సంబంధం లేదు.

ప్రభుత్వం వాళ్లను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మౌలిక సదుపాయాలు కూడా కల్పించదు. దాంతో వాళ్లు కూడా ప్రభుత్వానికి ఆస్తి పన్నులు, కరెంటు బిల్లుల వంటివి చెల్లించే పనిలేదు. వాళ్ల ప్రపంచంలో వాళ్లు హ్యాపీగా ఉంటారు. దీంతో వాళ్లకు ట్యాక్సులు గట్రా ఉండవు కాబట్టి ఎవ్వరైనా సరే ఆ సిటీకి వెళ్లి… హాయిగా ఉండిపోవచ్చు. అక్కడ ఉండే ఇళ్లల్లో ఉండొచ్చు. కనీసం రెంట్ కూడా కట్టనక్కర్లేదు.పెద్దగా సౌకర్యాలు ఉండవుకాబట్టి అడ్జస్ట్ అయ్యేవాళ్లు ఎవరైనా ఉండొచ్చు..ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చు..

ఈ స్లాబ్ సిటీ గురించి చెప్పాలంటే..స్లాబ్ సిటీలో 1930లో ఓ ఆర్మీ బేస్ క్యాంప్ ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అది మొత్తం ఖాళీ అయిపోయింది. ఉండాలనుకునేవారు మాత్రం ఉంటారు. రావాలనుకునేవాళ్లు వస్తారు..పోవాలనుకునేవాళ్లు పోతారు. రెండో ప్రపంచ యుద్ధంనాటి కాలంలో ఏర్పాటు చేసిన భవనాలను ఈనాటికీ ఉపయోగిస్తున్నారు. అవే ఈ 150 కుటుంబాలవాళ్లకు చెందిన ఇళ్లు.

టూరిస్టులు ఎవరైనా అక్కడకు సరదాగా వచ్చి కొన్ని రోజులు గడిపి వెళ్తుంటారు. అందుకోసం వాళ్లు ఎవరికీ రెంట్ చెల్లించాల్సిన పనేలేదు. ప్రభుత్వం ఇక్కడుండే వారిని ఎవరు, ఏమిటి? ఎవరొస్తున్నారు? ఎవరు పోతున్నారు? ఎవరుంటున్నారు? అనే విషయాలు ఏమాత్రం పట్టించుకోదు. అందుకే ఆ ప్రదేశాన్ని అమెరికాలో ‘‘లాస్ట్ ఫ్రీ ప్లేస్’’ అని అంటారు. అమెరికా లాంటి హై సెక్యూరిటీ దేశంలో… ఇటువంటి వింత ఏరియా ఉండటం ఆశ్చర్యమే. నమ్మశక్యంకాకపోయినా..ఇది నిజం..

మరి అక్కడ ఎలా ఉంటున్నారు? అంటే..
కరెంట్, వాటర్ లేని ప్రాంతంలో ఎలా ఉంటున్నార్రా బాబూ..అక్కడికి వెళితే ఎలా ఉండాల్రా బాబూ అని భయపడనవసరం లేదు. అవసరమే అన్నీ నేర్పిస్తుందన్నట్లుగా..స్లాబ్ సిటీలో నివసించే స్థానికులు కరెంటు కోసం సోలార్ పవర్ వాడుకుంటున్నారు. చుట్టు పక్కల ఊళ్ల నుంచీ సరుకులు తెచ్చుకుంటున్నారు. చెత్తా, చెదారాన్ని రీసైక్లింగ్ చేసుకుంటున్నారు.

తమ బతుకులు తామే బతకాలి కాబట్టి… అక్కడి వాళ్లు చాలా క్రమశిక్షణతో, కలిసి మెలిసి జీవిస్తుంటారు. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటారు. అన్నీంటినీ షేర్ చేసుకుంటారు. టూరిస్టులు అక్కడికి వస్తే… వాళ్లను చాలాబాగా చూసుకుంటారు. మర్యాదగా చూసుకుంటారు. టూరిస్టులు ఇష్టపడి ఇచ్చే డబ్బు వాళ్లకు చాలా అవసరాలకు ఉపయోగించుకుంటుంటారు. అక్కడికి వచ్చే టూరిస్టులు ఏమన్నా ఇస్తే పుచ్చుకుంటారు. ఏమీ ఇవ్వకపోయినా… అడగరు..ఏమీ అనకపోవటం విశేషం..


ఈ స్లాబ్ సిటీలో ఎక్కడ చూసినా రకరకాల పెయింటింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇళ్లమీదా..గోడలమీదా? వాహనాల మీదా ఎక్కడ చూసినా రంగు రంగుల పెయింటింగులకు కనిపించి కనువిందు చేస్తుంటాయి. ఆ ప్రతిభ అంతా స్థానికులదే. వాళ్ల టాలెంట్ మొత్తం చూపించేసి రకరకాల పెయింటింగ్ లు వేస్తుంటారు. ఈ సిటీలో ఉండేవారిలో దాదాపు అందరూ ఆర్టిస్టులే. వాళ్లకు ఏ పాత వస్తువు, గోడ కనిపించినా… అది కలర్‌ఫుల్ గా మారిపోవాల్సిందే. పెయింటింగులతో నిండిపోవాల్సిందే. మరి మీరు అమెరికా వెళితే ఒక్కసారి ఈ స్లాబ్ సిటీపై ఓ లుక్ వేసి రండీ..అలా వెళితే.. మీ వంతుగా స్థానికులకు ఏదన్నా చేసి రండీ..అఫ్ కోర్స్..ఇష్టమైతేనే..లేకుంటే వాళ్లు అడగరనే విషయం తెలిసిందేకదూ..ఏది ఏమైనా భలే వింతగా ఉంది కదూ..ఈ స్లాబ్ సిటీ వింతలు..విశేషాలు..