నాసా ప్రయోగం: ఆస్టరాయిడ్‌పైకి సేఫ్ ల్యాండ్ అయిన స్పేస్‌క్రాఫ్ట్

నాసా ప్రయోగం: ఆస్టరాయిడ్‌పైకి సేఫ్ ల్యాండ్ అయిన స్పేస్‌క్రాఫ్ట్

NASA స్పేస్‌క్రాఫ్ట్ Asteroid మీద ల్యాండ్ అయింది. ముందుగా ప్లాన్ చేసినట్లు అక్కడి మట్టి, రాతి శాంపుల్స్ ను పరీక్షించడమే టార్గెట్. 200 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న నాసా ఒక పురాతన Asteroid నుంచి నమూనాలు సేకరించేందుకు ఇంజనీరింగ్ పార్టనర్ తో కలిసి రెడీ అయింది.

భూమికి తీసుకొచ్చి, గ్రహ శకలాలు, విశ్వం గురించి మరిన్ని అంశాలపై రీసెర్చ్ చేయాలని.. శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటివరకూ జపాన్‌ మాత్రమే ఈ ఘనత సాధించింది. నాసాకు చెందిన ‘OSIRIS-REx‌’ స్పేస్‌క్రాఫ్ట్ ‘బెన్ను’ అనే ఆస్టరాయిడ్ నుంచి 5నుంచి 10 సెకన్లలో శాంపుల్స్‌ను కలెక్ట్ చేసి భూమి మీదకు పంపిస్తుంది.



అక్కడ 6గంటల 11నిమిషాలకు ల్యాండ్ అయిన స్పేస్‌క్రాఫ్ట్ 18నిమిషాలలోనే సిగ్నల్ ను భూమి మీదకు పంపింది. ‘ఇంత పారదర్శకంగా జరిగిందంటే దీనిని మేం నమ్మలేకపోతున్నాం’ అని మిషన్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాంటె లారెట్టా నాసా లైవ్ బ్రాడ్ కాస్ట్ ఆపరేషన్ లో అన్నారు. స్పేస్‌క్రాఫ్ట్ చేయాలనుకున్న ప్రతి పనిని చేయగలదు’ అని ఆయన అన్నారు.
https://10tv.in/nokia-wins-nasa-contract-to-put-a-4g-network-on-the-moon-yes-really/
సరిపడినంత శాంపుల్స్ సేకరించారా లేదా.. కనీసం 2.1 ఔన్సుల (60 గ్రాముల) శాంపుల్ ను సేకరించారా అనేది కన్ఫామ్ చేసుకోవడానికి మరి కొద్ది రోజుల సమయం పడుతుంది. డిసెంబర్ 2018 నుంచి బెన్నూ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. Asteroidను స్కాన్ చేస్తూ.. డేటా సేకరిస్తుంది.

స్పేస్ క్రాఫ్ట్ కిలోమీటర్ దూరం నుంచి వేగం తగ్గించుకుంటూ ల్యాండ్ అయింది. చివరి 2నిమిషాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. అక్కడి నుంచి మార్చి 2021లో బయటికొస్తుంది. తిరిగి 2023 సెప్టెంబర్ 24న భూమి మీదకు చేరుకుంటుంది.




2.3 మీటర్ల పొడవు ఉన్న ఒసైరిస్‌-రెక్స్‌ వ్యాన్‌ పరిమాణంలో ఉంటుంది. 80 కోట్ల డాలర్ల విలువైన ఈ వ్యోమనౌకను 2016లో నాసా ప్రయోగించింది. బెన్నుపై ఇసుక ఉంటుందని తొలుత ఆ సంస్థ అంచనావేసింది. ఈ మేరకు 2 సెంటీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే చిన్నపాటి రాళ్లను మాత్రమే సేకరించేలా ఒసైరిస్‌-రెక్స్‌ను రూపొందించారు.

2018లో ఆ ఖగోళ వస్తువు వద్దకు స్పేస్‌క్రాఫ్ట్ చేరాక అసలు విషయం అర్థమైంది. భారీ శిలలు, గులకరాళ్లు ఉన్నట్లు తెలియడంతో ఆ ఆస్టరాయిడ్‌పై తీవ్రంగా గాలించి, ‘నైటింగేల్‌’ అనే సున్నిత ప్రాంతాన్ని నాసా శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. అక్కడ చిన్నపాటి రేణువులు ఎక్కువగా ఉన్నాయి. వాటిని రగోలిత్ అంటారు.