Comet Leonard : డిసెంబర్ 12న ఆకాశంలో అద్భుతం.. 70వేల ఏళ్ల తర్వాత కనిపించనున్న ఆ గ్రీన్‌ కలర్‌ తోకచుక్క చూడాలంటే?

డిసెంబర్‌ నెలలో అంతరిక్షంలో ఈ నెల 12న ఆకాశంలో అద్భుతం జరుగనుంది. దాదాపు 70వేల ఏళ్ల తర్వాత భూమికి అతిచేరువగా ఆకుపచ్చని రంగులో ఉండే (Leonard Comet)తోకచుక్క వస్తోంది.

Comet Leonard : డిసెంబర్ 12న ఆకాశంలో అద్భుతం.. 70వేల ఏళ్ల తర్వాత కనిపించనున్న ఆ గ్రీన్‌ కలర్‌ తోకచుక్క చూడాలంటే?

Nasa Wonderful In The Sky On The 12th Of This Month .. Green Color Comet Sighting

Comet Leonard : డిసెంబర్‌ నెలలో అంతరిక్షంలో అనేక అద్భుతాలు జరుగనున్నాయి. ఈ నెల 12న ఆకాశంలో అద్భుతం జరుగనుంది. దాదాపు 70వేల ఏళ్ల తర్వాత భూమికి అతిచేరువగా ఆకుపచ్చని రంగులో ఉండే (Leonard Comet) ఒక తోకచుక్క కాంతులను విరజిమ్ముతూ దూసుకొస్తోంది. ఇలాంటి తోకచుక్క మనకు కనిపించడానికి కొన్నివేల సంవత్సరాలు పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ తోకచుక్కలో ఓ ప్రత్యేకత ఉందంట.. తిమింగలానికి దీనికి సంబంధం ఉందంట.. ఈ తోకచుక్క NGC 4631 గెలాక్సీ నుంచి దూసుకొస్తోంది. గెలాక్సీ తిమింగలం మాదిరిగా ఉండటం వల్ల దానికి తిమింగలం గెలాక్సీ అని పేరు వచ్చింది. ఐదు వరకు గ్రహశకలాలు భూమివైపు దూసుకొస్తున్నాయి. డిసెంబర్ 12న (Leonard Comet) తోకచుక్క భూమికి దగ్గరగా రానుంది.

ఇందులో విశేషం ఏంటంటే.. డిసెంబర్ మాసమంతా ఈ తోకచుక్క కనిపిస్తూనే ఉంటుందట.. ఈ నెలలో 12వ తేదీన మాత్రమే మనకు స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు సైంటిస్టులు. 2021 ఏడాదిలో భూమికి అతిచేరువగా రానున్న తోకచుక్క కూడా.. 2021 జనవరి నెలలో గురుగ్రహానికి దగ్గరగా ఉన్నప్పుడు సైంటిస్టులు ఈ తోకచుక్కను కనుగొన్నారు. మన గ్రహానికి చేరువగా దూసుకొచ్చే ఈ తోకచుక్క లక్ష్యం సూర్యగ్రహమేనని చెబుతున్నారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించి ఆపై తిరిగి గెలాక్సీ దిశగా పయనించనుందని అంటున్నారు సైంటిస్టులు. పసుపురంగులో కనువిందు చేసే తోకచుక్కలు.. ఆకుపచ్చ రంగులో కనిపించడం అరుదు.. ఈ తోకచుక్కల్లో రసాయనాలు మండుతూ ఆకు పచ్చ రంగులో మెరుపులు వెదజల్లుతుంటాయి.

దాని తోక ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. ఇలాంటి తోకచుక్క భూమికి చేరువగా రావడమనేది 70వేల సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. గ్రీన్ కలర్ తోకచుక్క జనవరి 3, 2022 రోజున సూర్యుడికి అతిదగ్గరగా వెళ్లనుంది. అప్పుడు అత్యంత కాంతివతంగా మారి చిన్నదిగా కనిపించనుంది. ఈ తోకచుక్కను వీక్షించాలంటే డిసెంబర్ 12న సూర్యోదయం కాకముందే చూడాల్సి ఉంటుంది. తూర్పు-ఈశాన్య దిక్కు నుంచి చూడాలి. బైనాక్యులర్ మీ దగ్గర ఉంటే సులభంగా వీక్షించవచ్చు. ఆ సమయంలో చూడలేకపోతే.. రోజూ ఉదయం సూర్యోదయానికి 2 గంటల ముందు తూర్పు దిక్కులో కనిపిస్తుంది.

Read Also : WhatsApp New Scam : ఆ మేసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్