Rishi Sunak Hindu : ‘నేను హిందువునే..’ గర్వంగా చెప్పుకున్న రిషి సునక్.. బ్రిటన్ తొలి హిందూ ప్రధానిగా చరిత్ర

తాను హిందువునని రిషి సునక్ గర్వంగా ప్రకటించుకున్నారు. బయట కూడా ఆయన తన మత సంప్రదాయాలను, విశ్వాసాలను ఆచరిస్తూ కనిపిస్తారు. 2015లో తొలిసారి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు. ఆయన గెలుపు కోసం బ్రిటన్‌లోని భారత సంతతి ప్రజలు పూజలు సైతం చేశారు.

Rishi Sunak Hindu : ‘నేను హిందువునే..’ గర్వంగా చెప్పుకున్న రిషి సునక్.. బ్రిటన్ తొలి హిందూ ప్రధానిగా చరిత్ర

Rishi Sunak Hindu : భారత మూలాలున్న రిషి సునక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌కు తొలి భారత/ఆసియా సంతతి ప్రధాని కాబోతున్నారు. యూకే 57వ ప్రధానమంత్రిగా 42 ఏళ్ల రిషి సునక్ బాధ్యతలు తీసుకోనున్నారు. 1812లో ప్రధాని అయిన లార్డ్ లివర్ పూల్ తర్వాత ఆ స్థాయికి ఎదిగిన అత్యంత చిన్న వయస్కుడిగా మరో రికార్డు సృష్టించారు రిషి సునక్.

ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఇప్పుడు మనోడు పాలించబోతున్నాడు. దీపావళి పండుగ రోజున 130 కోట్ల భారతీయులకు మర్చిపోలేని గిఫ్ట్ అందించారు మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు.

రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించడం తమకు మాత్రమే తెలుసంటూ విర్రవీగిన తెల్లదొరలకు ఇప్పుడు భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధాని అయ్యారు. భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ను పరిపాలించనుండడం చరిత్రలో నిలిచిపోయే అంశం. బ్రిటన్‌ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు రిషి. ఈ సందర్భంగా రిషి సునక్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.

తాను హిందువునని రిషి సునక్ గర్వంగా ప్రకటించుకున్నారు. బయట కూడా ఆయన తన మత సంప్రదాయాలను, విశ్వాసాలను ఆచరిస్తూ కనిపిస్తారు. 2015లో తొలిసారి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు. ఆయన గెలుపు కోసం బ్రిటన్‌లోని భారత సంతతి ప్రజలు పూజలు సైతం చేశారు.

కాగా.. రిషి సునక్ ఒంటి రంగు ఆయన ప్రధాని కావడానికి అవరోధం కావొచ్చని భారత సంతతి ప్రజలు భయపడ్డారు. కానీ, వారి భయాలు ఇప్పుడు పటాపంచలయ్యాయి. ఆసియా సంతతి నేతను ప్రధానిగా ఎంచుకునే స్థాయికి కన్సర్వేటివ్ పార్టీ ఇంకా రాలేదనే విమర్శలకు కూడా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పాలక టోరీలకు నాయకత్వం వహించే తన మొదటి ప్రయత్నంలో విఫలమైనా.. ఆ తర్వాత కొద్ది వారాల్లోనే అనుకున్నది సాధించారు రిషి సునక్. బ్రిటన్‌కు నాయకత్వం వహించిన మొదటి భారతీయ వారసత్వం మరియు హిందూ విశ్వాసం కలిగిన మొదటి వ్యక్తిగా సునక్ చరిత్ర సృష్టించనున్నారు. సునక్ పూర్వీకులు పంజాబ్‌కు చెందినవారు. 1960లలో తూర్పు ఆఫ్రికా నుండి బ్రిటన్‌కు వలస వెళ్లారు. సునక్ తండ్రి దక్షిణ ఆంగ్ల తీరంలో సౌతాంప్టన్‌లో డాక్టర్, తల్లి స్థానిక ఫార్మసీని నడుపుతోంది. ఇంగ్లీష్ తో పాటు హిందీ, పంజాబీ కూడా తెలుసు.

సునక్ నిత్యం దేవాలయంలో ఉంటాడు. అతని కుమార్తెలు అనౌష్క, కృష్ణ కూడా భారతీయ సంస్కృతి తెలిసిన వారే. ఎంపీ కాగానే భగవద్గీతపై ప్రమాణం చేశారు రిషి సునక్. తాను బ్రిటీష్ పౌరుడైనప్పటికీ, తాను “గర్వించదగిన హిందువు”గా కూడా కొనసాగుతున్నానని సునక్ బహిరంగంగా చెప్పారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో MBA చదువుతున్నప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అయిన అక్షతా మూర్తిని కలిశాడు. వారు ఆగస్టు 2009 లో వివాహం చేసుకున్నారు. అక్షత ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు మరియు భారతదేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమార్తె. సునక్ తరచుగా “తన అత్తమామల గురించి చాలా గర్వపడుతున్నాను” అని చెబుతూ ఉండేవాడు.

సునక్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో £730 మిలియన్ల భారీ నికర విలువతో అత్యంత ధనవంతుడు. వారి సంపదలో ఎక్కువ భాగం ఇన్ఫోసిస్‌లో వాటా నుండి వచ్చినట్లు నమ్ముతారు. కానీ సునక్ 2015లో కన్జర్వేటివ్ పార్టీ సభ్యునిగా రాజకీయాల్లోకి రాకముందు ఫైనాన్స్‌లో లాభదాయకమైన వృత్తిని కలిగి ఉన్నారు. సునక్ దంపతులకు లండన్‌, యార్క్‌షైర్‌లోని సునక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మరియు కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో గృహాలు ఉన్నాయి. సునక్ రాజకీయ జీవితం 2015లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌లో టోరీ సీటును గెలుచుకోవడంతో ప్రారంభమైంది.

రిషి సునాక్ తండ్రి యశ్వీర్ డాక్టర్ కాగా, తల్లి ఉష ఓ మెడికల్ షాపు యజమాని. రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ నగరంలో జన్మించారు. ఆర్థిక రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నారు. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ ఫర్డ్ లో ఎకనామిక్స్, పాలిటిక్స్, ఫిలాసఫీ సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్టాన్ ఫర్డ్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.

రిషి సునక్ 2001-04 మధ్యకాలంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్ మన్ సాక్స్ లో అనలిస్ట్ గా పనిచేశారు. 2004 నుంచి 2015 మధ్య కాలంలో వివిధ ఫండ్ మేనేజ్ మెంట్ సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో రాజకీయాలపై ఆసక్తితో కన్జర్వేటివ్ పార్టీలోకి వచ్చారు. కొత్త తరం నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రిచ్ మండ్ నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యారు.

రిషి సునాక్ కరోనా సంక్షోభ సమయంలో ఆర్థికమంత్రిగా విశిష్ట సేవలు అందించి సత్తా చాటుకున్నారు. థెరెస్సా మే, బోరిస్ జాన్సన్ ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు చేపట్టి సమర్థుడిగా గుర్తింపు పొందారు. బ్రిటన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు.

బ్రిటన్ లోని 250 సంపన్న కుటుంబాల్లో రిషి సునాక్ ఫ్యామిలీ ఒకటి. వీరికి 750 మిలియన్ పౌండ్ల సంపద ఉన్నట్టు అంచనా. ఆయనకు క్రికెట్, ఫుట్ బాల్, సినిమాలు అంటే ఇష్టం. ఫిట్ నెస్ పై మక్కువ చూపిస్తారు.

సరిగ్గా 48 రోజుల క్రితం బ్రిటన్‌లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీలో ప్రధాని అభ్యర్థి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. లిజ్‌ ట్రస్‌, రిషి సునాక్‌ మధ్య హోరాహోరీ పోరులో చివరకు విజయం ట్రస్‌నే వరించింది. ప్రచారం సమయంలో సునక్‌ మాటలు పట్టించుకోని టోరీ సభ్యులు ట్రస్‌ వైపే మొగ్గారు. అయితే ఆమె స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ట్రస్‌కు 57శాతం ఓట్లు రాగా.. సునాక్‌కు 43శాతం ఓట్లు లభించాయి.

కట్‌ చేస్తే..
అనూహ్యంగా ప్రధాని రేసులోకి వచ్చి పదవి చేపట్టిన ట్రస్‌ అనుకోని విధంగా పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. దీంతో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ సారి రిషి సునాక్‌కు అవకాశం చేజారలేదు. తప్పు తెలుసుకున్న టోరీ ఇప్పుడు ఆయనకు పట్టం కట్టింది. నెలన్నర రోజుల క్రితం ఓటమిపాలైన అదే సునాక్‌.. నేడు బ్రిటన్‌ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు.