Costly Cottage : నీరు లేదు, కరెంటూ లేదు.. అయినా ఈ కాటేజీ ధర రూ.5 కోట్లు, ఎందుకంత రేటు అంటే..

ఈ రోజుల్లో చిన్న ఇల్లు కొనాలన్నా ముందుగా చూసేది సౌకర్యాలే. అందులో ప్రధానమైనది నీటి సరఫరా. ఆ తర్వాత విద్యుత్ కనెక్షన్. ఆ తర్వాత డ్రైనేజీ, రోడ్డు. ఈ సౌకర్యాలు ఉన్నాయో లేదో అని చూసుకు

Costly Cottage : నీరు లేదు, కరెంటూ లేదు.. అయినా ఈ కాటేజీ ధర రూ.5 కోట్లు, ఎందుకంత రేటు అంటే..

Cottage

Costly Cottage : ఈ రోజుల్లో చిన్న ఇల్లు కొనాలన్నా ముందుగా చూసేది సౌకర్యాలే. అందులో ప్రధానమైనది నీటి సరఫరా. ఆ తర్వాత విద్యుత్ కనెక్షన్. ఆ తర్వాత డ్రైనేజీ, రోడ్డు. ఈ సౌకర్యాలు ఉన్నాయో లేదో అని చూసుకుంటాం. ఇవేమీ లేకుంటే ఆ వైపు కూడా కన్నెత్తి చూడం. అలాంటిది… ఇలాంటి సౌకర్యాలు ఏవీ లేని ఓ కాటేజ్‌ను ఏకంగా రూ.5.5 కోట్లకు అమ్మకానికి పెట్టారంటే నమ్మగలరా? కానీ ఇది నిజం.

Aadhaar number: మీ ఆధార్‌తో లింకింగ్ ఉన్న ఫోన్ నెంబర్ల గురించి తెలుసుకోండిలా..

బ్రిటన్‌లోని అచ్చం అలాంటి కాటేజ్‌ ఒకటి అత్యధిక మొత్తానికి అమ్మకానికి పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్రిటన్‌లోని డేవాన్‌ సముద్రం ఒడ్డున ఉన్న ఈ ఆఫ్‌ గ్రిడ్‌ హౌస్‌ ప్రత్యేకతలు ఏంటంటే.. ఈ కాటేజ్‌కు విద్యుత్‌ లేదు. నీటి సరఫరా లేదు. ఇంటర్నెట్‌ దరిదాపుల్లో లేదు. అయినప్పటికీ దాదాపు రూ.5.56 కోట్లకు అమ్మకానికి పెట్టాడు దాని యజమాని.

దీని ప్రత్యేకత ఏంటంటే.. బ్లూ సీ కి సమీపంలోని ఎత్తైన కొండ ప్రాంతంలో ఉండటమేనంట. ఈ కాటేజ్‌ నేషనల్‌ ట్రస్ట్‌ యాజమాన్యంలోని మన్సాండ్ బీచ్‌పైన ఉన్న రిమోట్‌ గేట్‌అవేలో ఉంది. ప్రకృతితో మమేకమై ప్రశాంతమైన జీవనాన్ని ఆస్వాదించాలనే వారికి ఈ కాటేజ్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే అంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఆ కాటేజ్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారట.

WhatsApp Tricks: వాట్సాప్ చాట్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ ఇలా చదవొచ్చు!

* ఈ కాటేజ్‌లో రెండు పెద్ద బెడ్‌ రూమ్ లు ఉన్నాయి.
* పైన గడ్డితో చేసిన గది ఉంది.
* ఇందులో లాంజ్‌, డైనింగ్‌ రూం, ఫ్రంట్‌ అండ్ బ్యాక్‌ వరండా, రెండు గెస్ట్‌ బెడ్‌రూంలు, పవర్‌ రూం, వంట గది ఉన్నాయి.
* ఈ కాటేజ్‌ ను 1,345 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
* కిచెన్‌లో గ్యాస్‌ కుకర్‌, ఎల్‌పీజీ లైట్లు ఉన్నాయి.
* వర్షపు నీటిని నిల్వ చేసి తాగునీటిగా మార్చే సదుపాయం ఉంది.
* ఈ కాటేజ్‌కు వెళ్లేందుకు బీచ్‌ నుంచి రోడ్డు ఉంది.
* ఈ ప్రదేశం కారు పార్కింగ్‌ నుంచి 15 నిమిషాల్లో నడిచి చేరుకోవచ్చని ఈ ఆస్తి విక్రేత మిచెల్‌ స్టీవెన్స్‌ తెలిపారు.
* ఇక్కడ ఉండే వారు సొంత ప్రైవేట్‌ ఒయాసిస్‌ను కలిగి ఉన్న అనుభూతిని ఆస్వాదించవచ్చని, ఇక్కడ ఉండటం వలన రోజూవారి జీవితంలో ఒత్తిళ్ల నుంచి బయటపడొచ్చని ఆయన చెప్పారు.