ఉబెర్ కు పోటీగా : UKలో ఓలా ఆటోలు 

హలో అని ఫోన్ చేస్తే చాలు పొలో అంటు మన ముందు వాలిపోతున్నాయి క్యాబ్ లు.  క్యాబ్ లు కొంచెం ఖర్చు అనుకునేవారికి ఆటోలు కూడా అందుబాటుకొచ్చి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేశాయి.

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 05:49 AM IST
ఉబెర్ కు పోటీగా : UKలో ఓలా ఆటోలు 

హలో అని ఫోన్ చేస్తే చాలు పొలో అంటు మన ముందు వాలిపోతున్నాయి క్యాబ్ లు.  క్యాబ్ లు కొంచెం ఖర్చు అనుకునేవారికి ఆటోలు కూడా అందుబాటుకొచ్చి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేశాయి.

లండన్ : హలో అని ఫోన్ చేస్తే చాలు పొలో అంటు మన ముందు వాలిపోతున్నాయి క్యాబ్ లు.  క్యాబ్ లు కొంచెం ఖర్చు అనుకునేవారికి ఆటోలు కూడా అందుబాటుకొచ్చి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేశాయి. వీటిలో ఓలా ఆటోలు అందరికి సుపరిచితమే. ఇండియాలో ఓలా అంటే హలా (స్నేహితురాలు) అనుకునేలా ఉన్నాయి. ఈ క్రమంలో మన ఓలా ఆటోలు ఇండియాలోనే కాదు ఇంగ్లండ్ లో కూడా తిరిగేస్తున్నాయండోయ్. ‘హే ఆటో’ అంటే భారతీయుల ఇంటి గుమ్మంలో వాలిపోయే ఓలా ఆటోలు ఇంగ్లండ్ రోడ్లపై తిరిగేస్తున్నాయి. 
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష

భారతదేశంలోని మెట్రో నగరాల్లో విపరీతంగా సందడి చేసే ఓలా ఆటోలు లండన్ లో మనకు కనపడితే అన్నా బకింగ్హామ్ ప్యాలస్ కు వెల్దామా? బిగ్ బెన్ గడియారం దగ్గరకు వెల్దామా.. అన్నా టవర్ ఆఫ్ లండన్ కు ఎంత తీసుకుంటావ్.. అని అడుగే సౌకర్యం కలిగించింది ఓలా సంస్థ.  ప్రముఖ ట్రావెల్ యాప్.. ‘ఓలా’ మన ఆటోను ఇంగ్లాండ్‌లో సర్వీసుల్ని అందిస్తోంది. ఇలా ఓలా ఆటోలను ఇంగ్లండ్ వాసులకు కూడా అందుబాటులోకి తీసుకెళ్లింది. ‘ఉబెర్’కు పోటీ ఇచ్చేందుకు తొలిసారిగా ఇంగ్లండ్ లో  ఆటో సేవలను ప్రారంభించింది ఒలా. 
 

ఇండియాకు చెందిన ‘బజాజ్ ఆటో’, ఇటలీకి చెందిన ‘పియాజ్జియో’ల ఆటోలనే ఇంగ్లండ్ లో కూడా నడుపుతోంది. ముందుగా లివర్‌పూల్‌లో ప్రారంభించిన ఈ ఆటోలు పచ్చ రంగులో మెరుస్తు..లివర్‌పూల్ ప్రజలు తెగ మురిసిపోతున్నారట.  బ్యాటరీతో నడిచే ఈ ఆటోలతో కాలుష్యం బాధ కూడా ఉండదు.  కస్టమర్లను ఆకట్టుకోడానికి కొద్ది రోజులపాటు ఇంగ్లండ్ వాసులకు ఓలా ఆటోలు ఫ్రీ సర్వీస్ ను కూడా అందిస్తాయంటోంది ఓలా సంస్థ. అంతేకాదు ఏప్రిల్ లోగా ఓలా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేవారికి 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఓలా ప్రకటించింది. 
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ