Operation Kaveri: సుడాన్ నుంచి భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ కావేరీ.. తొలి బ్యాచ్‌లో 278 మంది

Operation Kaveri: భారతీయులను మొదట సౌదీ అరేబియాలోని జెడ్డాకు కేంద్ర సర్కారు తరలించింది. అక్కడి నుంచి భారత్ కు తీసుకురానున్నారు.

Operation Kaveri: సుడాన్ నుంచి భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ కావేరీ.. తొలి బ్యాచ్‌లో 278 మంది

Operation Kaveri

Operation Kaveri: సూడాన్‌లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరీ (Operation Kaveri) ని ప్రారంభించింది. పోర్ట్ సూడాన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది.

మొదటి బ్యాచ్ లో సుడాన్ పోర్టు నుంచి 278 మంది భారతీయులను మొదట సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించింది. అక్కడి నుంచి భారత్ కు తీసుకురానున్నారు. సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న మిగతా భారతీయులను కూడా తరలించనుంది. సమీప ప్రాంతంలో మరో నౌకను కూడా సిద్ధంగా ఉంచింది భారత ప్రభుత్వం. సూడాన్ అంతర్యుద్ధంలో గురితప్పిన తూటా తగిలి ఇప్పటికే ఒక భారతీయుడు మృతి చెందాడు.

సుమారు 3,000 మందికి పైగా భారతీయులు సూడాన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వారందరినీ మొదట పోర్ట్ సూడాన్‌కు చేర్చి, అక్కడి నుంచి భారత్‌కు తరలించనున్నారు. వారందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఆపరేషన్ మొదలు పెడతామని ఇప్పటికే విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 500 మంది పోర్ట్ సుడాన్ చేరుకున్నట్లు విదేశాంత మంత్రి జైశంకర్ కూడా ప్రకటన చేశారు.

Saint Von Colucci : అతడిలా కనిపించేందుకు 12 సర్జరీలు.. చివరికి ప్రాణం పోగొట్టుకున్న నటుడు!