Pakistan: వామ్మో.. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర ఎంతో తెలుసా.. ఇండియాతో పోల్చితే..

పాకిస్థాన్ ను ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతోంది. ఆ దేశంలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, ఏటీఎంలలో నగదు లేదంటూ రెండురోజుల క్రితం ఆ దేశ మాజీ క్రికెటర్ ట్వీట్ చేసిన విషయం విధితమే. నిత్యావసర ధరలుసైతం పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా పాకిస్థాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇండియాలో లీటర్ పెట్రోల్ రూ. 100 దాటితేనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా పాకిస్థాన్ లో...

Pakistan: వామ్మో.. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర ఎంతో తెలుసా.. ఇండియాతో పోల్చితే..

Petrol Price

Pakistan: పాకిస్థాన్ ను ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతోంది. ఆ దేశంలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, ఏటీఎంలలో నగదు లేదంటూ రెండురోజుల క్రితం ఆ దేశ మాజీ క్రికెటర్ ట్వీట్ చేసిన విషయం విధితమే. నిత్యావసర ధరలుసైతం పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా పాకిస్థాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇండియాలో లీటర్ పెట్రోల్ రూ. 100 దాటితేనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా పాకిస్థాన్ లో పెట్రోల్ ధరలు లీటరు రూ. 180కు చేరాయి. అక్కడి ప్రభుత్వం ఒక్కరోజులోనే పెట్రోల్ లీటర్ ధరపై రూ. 30 పెంచింది. పెంచిన ధరలు గురువారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ధరల పెంపుతో పాకిస్థాన్ లో తాజాగా లీటర్ పెట్రోల్ రూ. 179.85, డీజిల్ లీటర్ ధర రూ. 174.15కు చేరింది.

కతార్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఏఎంఎఫ్) మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే 2019లో అంతర్జాతీయ ద్రవ్య నిధితో సంతకం చేసిన $6 బిలియన్ల ప్యాకేజీ నుండి సహాయాన్ని తిరిగి పొందేందుకు వీలుగా ఇంధన ధరలను పెంచనున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి తెలిపారు. శుక్రవారం నుండి ధరలు 20% పెరుగుతాయని మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ ట్వీట్‌లో తెలిపారు. ఆర్థికలోటుతో సతమతమవుతున్న దేశాన్ని గాడిలో పెట్టేందుకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావివ్వొద్దంటూ మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ పేర్కొన్నారు.

Pakistan: పాకిస్థాన్‌లో దారుణ పరిస్థితులు.. ట్విటర్‌లో పాక్ మాజీ క్రికెటర్ ఆవేదన..

వచ్చేనెలలో సమర్పించే వార్షిక బడ్జెట్‌కు ముందు ఆర్థిక లోటును తగ్గించడానికి చమురు, విద్యుత్ రంగాలలో సబ్సిడీలను ఉపసంహరించుకునే ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్, ఏఎంఐ మధ్య ధరల పెంపు ప్రధాన సమస్యగా మారింది. ప్రధాని పదవి నుంచి వైదొలగిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన అధికారంలో ఉన్న చివరి రోజుల్లో రెండంకెల ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రజలకు కొంత ఊరట కల్పించేలా సబ్సిడీని ఇచ్చారు. ఈ చర్య వల్ల 2019 ఒప్పందంలోని నిబంధనల నుండి వైదొలిగినట్లు ఏఎంఎఫ్ పేర్కొంది.