ధ్వంసమైన హిందూ ఆలయ నిర్మాణానికి పాక్ ప్రభుత్వం నిధులు

ధ్వంసమైన హిందూ ఆలయ నిర్మాణానికి పాక్ ప్రభుత్వం నిధులు

Pakistan regional gov’t to fund construction of destroyed temple : పాకిస్తాన్ ప్రావిన్స్ లోని ఖైబర్ Pakhtunkhwaలో ముస్లింలు ధ్వంసం చేసిన హిందు దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు పాకిస్తాన్ స్థానిక ప్రభుత్వం నిధులను సమకూరుస్తోంది. ఈ మేరకు సమాచార మంత్రి తెలిపారు. ప్రాంతీయ రాజధాని పెషావర్‌కు ఆగ్నేయంగా 100 కిలోమీటర్ల (62 మైళ్లు) కరాక్ పట్టణంలోని పరమన్స్ జీ మహారాజ్ సమాధి (Shri Paramhans Ji Maharaj Samadhi) ఆలయంపై డజన్ల కొద్ది ముస్లింలు బుధవారం దాడికి పాల్పడ్డారు. స్థానిక ముస్లిం నాయకుడితో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిందు ఆలయంపై దాడిలో జరిగిన నష్టానికి విచారిస్తున్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ప్రాంతీయ సమాచార మంత్రి కమ్రాన్ బంగాష్ పేర్కొన్నారు. ఆలయం పక్కనే అనుకోని ఉన్న ఇంటిని కూడా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మంత్రి బంగాష్ తెలిపారు.

హిందూ గ్రూపు యాజమాన్యంలో భవనానికి పునర్నిర్మాణం చేయడాన్ని నిరసిస్తూ 1,500 మంది గ్రామంలోని ఆలయంపైకి దాడి చేయడానికి వచ్చారు. హిందూ సమాజ సహకారంతో నిర్మాణం వీలైనంత త్వరగా ప్రారంభమవుతుందని, ఈ స్థలంలో భద్రత కల్పిస్తామని బంగాష్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి 45 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసు చీఫ్ ఇర్ఫానుల్లా ఖాన్ చెప్పారు. స్థానిక ముస్లిం నేత ముల్లా షరీఫ్ సహా, పలువురిపై ఆరోపణలు ఉన్నాయని అన్నారు.

ఆలయ విధ్వంసంపై నివేదిక సమర్పించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు గురువారం అధికారులను ఆదేశించింది. దేశంలోని ఎక్కువ మంది హిందువులు నివసించే సింధ్ ప్రావిన్స్‌లోని కరాచీలో 200 మందికి పైగా సుప్రీంకోర్టు వెలుపల నిరసన వ్యక్తం చేశారు. 1997లో ఇలాంటి పరిస్థితులలో ధ్వంసమైన ఈ ఆలయాన్ని 2015 లో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పునర్నిర్మించారు. ఈ ప్రాంతంలో హిందువులు ఎవరూ నివసించనప్పటికీ, భక్తులు తరచూ ఆలయాన్ని, మందిరాన్ని సందర్శిస్తారు.