PepsiCo Lay Off: : వందలాదిమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్న పెప్సీ కో..

ఉద్యోగుల కోతలో ఇప్పుడు మరో కంపెనీ వచ్చి చేరింది. అదే పెప్సీ కో. బడా బడా కంపెనీలో ఉద్యోగులను తొలగిస్తున్నక్రమంలో పెప్సీ కో కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది. వందలాదిమంది ఉద్యోగుల్ని ఇంటికి పంపేందుకు మెమోలు కూడా జారీ చేసింది.

PepsiCo  Lay Off: : వందలాదిమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్న పెప్సీ కో..

PepsiCo to cut hundreds of jobs

PepsiCo to cut jobs : ఉద్యోగుల కోతలో ఇప్పుడు మరో కంపెనీ వచ్చి చేరింది. అదే పెప్సీ కో. బడా బడా కంపెనీలో ఉద్యోగులను తొలగిస్తున్నక్రమంలో పెప్సీ కో కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది. వందలాదిమంది ఉద్యోగుల్ని ఇంటికి పంపేందుకు మెమోలు కూడా జారీ చేసింది. ఆర్థిక మాంద్యం దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీలే చేతులెత్తేస్తున్న క్రమంలో మెటా, అమెజాన్, హెచ్‌పీ, యాపిల్ సహా పలు టెక్ కంపెనీలు కూడా ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. ఈక్రమంలో నార్త్ అమెరికాలోని ప్లాంట్‌లో వందలాదిమందిని ఇంటికి పంపేస్తోంది పెప్సీ కో కంపెనీ. ఆర్థిక సమస్యలు పెరగటంతో ఉద్యోగులను వదిలించుకునే పనిలో పడింది పెప్పీకో. న్యూయార్క్ కు చెందిన స్నాక్స్, డ్రింక్స్ యూనిట్ల నుంచి వందలాదిమంది ఉద్యోగుల్ని తొలగించేస్తోంది.

నార్త్ అమెరికాలోని స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్‌లో వందలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేయగా..దానికి సంబంధించి ఉద్యోగులు అందుకున్న ఇంటర్నల్ మెమోలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది ‘వాల్‌స్ట్రీట్’ జర్నల్. సంస్థను మరింత సులభతరంగా మార్చడంలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్ ఇస్తున్నట్టుగా వెల్లడించింది. కానీ ఈ విషయాన్ని పెప్సీ మాత్రం ఈ అధికారికంగా ధ్రువీకరించలేదు. పెరిగిన చక్కెర, మొక్కజొన్న, బంగాళదుంపల ధరలతో పెరిగిన భారాన్ని పెప్సీ కో వినియోగదారులపైకి నెట్టేస్తోంది. అయినా నష్టాలు తప్పకపోవటంతోనే ఉద్యోగులను వదిలించుకునే పనిలో పడినట్లుగా సమాచారం. ధరలు పెరిగినప్పటికీ తమ ఉత్పత్తులు మార్కెట్లో ఇంకా బలంగానే ఉన్నాయని సదరు కంపెనీ చెబుతోంది. మరి ఉద్యోగుల్ని ఎందుకు తీసేయాల్సి వస్తోందో మాత్రం చెప్పటంలేదు.

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి వచ్చాక మొదలైన ఉద్యోగుల కోత మిగతా సంస్థలకూ పాకింది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా, అమెజాన్, హెచ్‌పీ, యాపిల్ సహా పలు టెక్ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించివేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం, మార్కెట్ ఒడిదొడుకులే కారణంతోనే ఉద్యోగుల్ని తొలగిస్తున్నామని చెబుతున్నాయి సదరు సంస్థలు. 2025 నాటికి దాదాపు 6 వేల మందిని తొలగిస్తామని హెచ్‌పీ ఇటీవల ప్రకటించింది. అలాగే అమెజాన్ 20 వేల మందిని ఇంటికి పంపిస్తోంది. ముందుగా 10,000 తొలగిస్తున్నట్టు వార్తలు రాగా ఆ తర్వాత అదికాస్తా 20,000 పెరిగింది. ఈ తొలగింపుల్లో అన్ని గ్రేడ్ల ఉద్యోగులూ ఉన్నారు. ఫేస్‌బుక్‌లో దాదాపు 11 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తుండగా..ఉద్యోగుల తొలగింపు లిస్టులోకి పెప్సీ కో కూడా వచ్చి చేరింది.