Musharraf Passes Away: పర్వేజ్ ముషారఫ్‌కు విదేశాల్లో కోట్ల విలువైన ఆస్తులు.. ఏఏ దేశాల్లో ఉన్నాయంటే..

పర్వేజ్ ముషారఫ్ పాక్ ప్రధాని పదవీకాలం మొత్తం వివాదాల మధ్యే సాగింది. ఓ నియంతలా ఆయన పాలన సాగించారనడంలో అతిశయోక్తి లేదు. అనేక అవినీతి ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. పాకిస్థాన్ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాల్లో కోట్ల ఆస్తులను ముషారఫ్ కూడగట్టుకున్నాడన్న విమర్శలు ఉన్నాయి.

Musharraf Passes Away: పర్వేజ్ ముషారఫ్‌కు విదేశాల్లో కోట్ల విలువైన ఆస్తులు.. ఏఏ దేశాల్లో ఉన్నాయంటే..

Musharraf Passes Away

Musharraf Passes Away: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, జనరల్ ఫర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. అమిలోయిడోసిస్ వ్యాధితో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ముషారఫ్ మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించినట్లు పాక్ మీడియా పేర్కొంది. పర్వేజ్ ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్థాన్ ప్రధానిగా కొనసాగారు. ముషారఫ్ అనారోగ్య సమస్య కారణంగా ట్రీట్‌మెంట్ కోసం మార్చి 2016 సంవత్సరంలో దుబాయ్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు.

Musharraf passes away: ప్రధానికి తెలియకుండానే..! భారత్, పాక్ మధ్య కార్గిల్ యుద్ధానికి కారకుడైన ముషారఫ్ ..

పర్వేజ్ ముషారఫ్ పాక్ ప్రధాని పదవీకాలం మొత్తం వివాదాల మధ్యే సాగింది. ఓ నియంతలా ఆయన పాలన సాగించారనడంలో అతిశయోక్తి లేదు. అనేక అవినీతి ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. పాకిస్థాన్ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాల్లో కోట్ల ఆస్తులను ముషారఫ్ కూడగట్టుకున్నాడన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మరణంతో ముషారఫ్ ఆస్తుల విషయంపై చర్చ జరుగుతుంది. అయితే ముషారఫ్ కొన్ని ఆస్తులను తన కుటుంబ సభ్యులకు బదలాయించినట్లు, కొన్ని ఆస్తులు తనపేరుమీదే ఉన్నాయని తెలుస్తుంది. ఓ కేసు విచారణ సందర్భంగా పర్వేజ్ ముషారఫ్ ఆస్తులను లెక్కించాల్సిందిగా పాకిస్థాన్ ప్రత్యేక ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏసీటీ) ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)ను కోరింది.

Musharraf passes away: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత

ఎఫ్ఐఏ నివేదిక ప్రకారం.. పర్వేజ్ ముషారఫ్‌కు పాకిస్థాన్‌లో ఎనిమిది ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. ఇందులో కరాచీలో రూ. 50లక్షల విలువైన ఇల్లు, 30 లక్షల విలువైన ప్లాట్లు, ఇస్లామాబాద్‌లో రూ.7.5 కోట్లు, 60లక్షల విలువైన ప్లాట్లు, లాహోర్‌లో రూ. 60లక్షల విలువైన ప్లాట్లు ఉన్నట్లు ఎఫ్ఐఏ తెలిపింది. విదేశాల్లోనూ ముషారఫ్‌కు కోట్లలోనే ఆస్తులు ఉన్నాయి. లండన్, దుబాయ్ వంటి దేశాల్లో కోట్ల విలువైన ఆస్తులు ముషారఫ్ పేరుపై ఉన్నాయని ఎఫ్ఐఏ తెలిపింది. ముషారఫ్ రిజిస్టర్డ్ బ్యాంకు ఖాతాల్లోనూ కోట్లాది విలువైన డబ్బులు ఉన్నట్లు ఎఫ్ఐఏ గుర్తించింది. విదేశీ బ్యాంకుల్లో దాదాపు రెండు కోట్ల డాలర్లు, పాక్ బ్యాంకులో రూ. 12.5 లక్షల కోట్లు డిపాజిట్లు ఉన్నాయని ఎఫ్ఐఏ గతంలో కోర్టుకు నివేదించింది.