Petrol price: రూ.150 దాటనున్న పెట్రోల్ ధర.. కారణం ఇదే!

ఆర్థిక సంక్షోభం దెబ్బకు పాకిస్థాన్ చరిత్రలో తొలిసారి పెట్రోల్ ధర రూ.150 దాటుతుందని చెబుతున్నారు.

Petrol price: రూ.150 దాటనున్న పెట్రోల్ ధర.. కారణం ఇదే!

Petrol Price

Petrol price may cross Rs 150 mark: ఆర్థిక సంక్షోభం దెబ్బకు పాకిస్థాన్ చరిత్రలో తొలిసారి పెట్రోల్ ధర రూ.150 దాటుతుందని చెబుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా లీటరుకు రూ.6, రూ.5 చొప్పున పెరిగినట్లు పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న చమురు ధరల భారాన్ని వినియోగదారులపై మోపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే, ఫిబ్రవరి 16 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.13 మరియు రూ.18 పెరగవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో పెట్రోల్ లీటరు రూ. 147.83, హై-స్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డీ) రూ. 144.62, లైట్ డీజిల్ ఆయిల్ (ఎల్‌డిఓ) లీటరు రూ. 114.54 చొప్పున విక్రయిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి షౌకత్ తారిన్ కూడా పెట్రోలియం ధరల పెరుగుదల గురించి చెబుతున్నారు. పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంధన రేట్లను తగ్గించలేకపోతుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఆ భారాన్ని ప్రభుత్వం ప్రజలపైనే మోపాల్సి వస్తుంది. ఫిబ్రవరి మొదటి 15 రోజుల పాటు పెట్రోలియం ధరలను యథాతథంగా ఉంచాలనే ప్రభుత్వం నిర్ణయించినా కూడా అది సాధ్యం కాలేదు. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల కారణంగా వచ్చే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న పెట్రోలియం ధరల కారణంగా జనవరి 15న పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను రూ.3.01 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం, పెట్రోలు మాత్రమే కాదు.. పెట్రోలియం ఉత్పత్తులు కూడా భారీగా పెరిగిపోయాయి.