shakira pizza order : షకీరా గొంతుతో పిజ్జా ఆర్డర్..‘ఆ పిజ్జా నేను తీసుకోవచ్చా’..అని అడిగిన పాప్ సింగర్
షకీరా గొంతుతో పిజ్జా ఆర్డర్ ఇచ్చిందో అమ్మాయి. మీరు ఆర్డర్ చేసిన పిజ్జా నేను తీసుకోవచ్చా’..అని అడిగింది పాప్ సింగర్ షకీరా.

Shakira Pizza Order
shakira pizza order : షకీరా. అందంతో పాటు అద్భుతమైన గొంతు..మైమరపించే డ్యాన్స్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించే పాప్ సింగర్. ‘హలో..మీరు ఆర్డర్ చేసిన పిజ్జా నేను తీసుకోవచ్చా?అంటూ ఓ యువతిని ట్విట్టర్ లో అడిగారు.దాంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ సింగర్ షకీరానే స్వయంగా అలా అడిగేసరికి ఆ అమ్మాయి ఉబ్బి తబ్బిబ్బు అయిపోయింది. తీసుకోండీ అంటూ ఆనందంగా చెప్పింది.ఇంతకీ షకీరాకు పిజ్జా కావాలంటే క్షణాల్లో ముందు వాలిపోతుంది. కానీ ఓ అమ్మాయిని అడాల్సిన పని ఏంటీ అంటే ..
శుభ అనే ఓ యువతి పాప్ సింగర్ షకీరా గొంతును మిమిక్రీ చేస్తు పిజ్జా ఆర్డర్ చేసింది. దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇంకేముంది..అసలే షకీరా గొంతు వైరల్ అవ్వకుండా ఉంటుందా ఏంటీ? సోషల్ మీడియాలో అది పిచ్చ వైరల్ అయిపోయింది. ఇదికాస్తా అసలైన షకీరా దృష్టికీ వెళ్లింది. దాన్ని ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యి..“నీ ఆర్డర్ నేను తీసుకోవచ్చా” అంటూ ఆమె ట్విటర్ ద్వారా సదరు యువతిని ఫ్రెండ్లీగా పలకరించారు. శుభ కూడా తెగ హ్యాపీ ఫీల్ అయిపోయి ఆనందంగా స్పందిస్తు తీసుకోండీ అంటూ చెప్పింది. ఈ పిజ్జా కథ వెనక..ఆమె షకీరా గొంతు మిమిక్రి చేయటం వెనుక కూడా ఓ స్టోరీ ఉందండోయ్..అదేమంటే..
షకీరా గొంతును మిమిక్రి చేసి ఓ పిజ్జా ఆర్డర్ ఇవ్వు అంటూ అమెరికాలో ఉన్న ఓ ఫ్రెండ్ శుభను సరదాగా అడిగారట. దాంతో శుభ అదే చేసింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది వైరల్ అయ్యింది. శుభ ఏదో సరదాగా చేసిన పోస్ట్ ఇంత వైలర్ అవుతుందనీ..అది షకీరా దృష్టికి వెళుతుందని అస్సలు అనుకోలేదు.దాంతో ఆర్డర్ చేసి వీడియోను పోస్ట్ చేయకుండా తనదగ్గరు రెండు నెలలు ఉంచుకుంది. ఈ తరువాత ఏదో చూస్తుండగా ఆ వీడియో కనిపించేసరికి సరదాగా దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. కానీ ఆమె ఊహించనివిధంగా కొన్ని గంటల్లోనే దానికి 70 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడవి సంఖ్య 2 కోట్లు దాటిపోయింది. ఇప్పటికీ తన వీడియో ట్రెండింగ్లో ఉండటం గర్వంగా ఉందని శుభ చెబుతోంది.
Read more : Husband Kills His Wife : సాక్ష్యం చెప్పిన కూతురు..తండ్రికి జీవిత ఖైదు వేసిన కోర్టు
షకీరా అంతటి పాప్ గాయని నుంచి స్పందన రావడం చాలా గొప్ప విషయమని మురిసిపోతోంది శుభ. శుభ అమెరికా వాసి అయినా ఆమె తెలుగంటి ఆడబిడ్డే కావటం మరో వివేషం. విశాఖకు చెందిన అమ్మాయి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే..ఆ పిజ్జా వీడియోకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఫిదా అయిపోయారు. ఫోన్ చేసి ‘మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు?’ అని శుభను అడిగారట. అందుకు ఆమె సమాధానం.. ‘మీరే’ అని చెప్పిందట. చూశారా మరి..సోషల్ మీడియా ఎంత పనిచేస్తోంది. ఏదో అనుకుంటే ఏదో అవుతోంది. దటీజ్ సోషల్ మీడియా..