‘ప్రపంచ ఉత్తమ అమ్మ’ఆదిత్యా తివారీ..అమ్మతనం అంటే అతన్నే చూపించాలి

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 07:08 AM IST
‘ప్రపంచ ఉత్తమ అమ్మ’ఆదిత్యా తివారీ..అమ్మతనం అంటే అతన్నే చూపించాలి

ఓ బిడ్డను దత్తత తీసుకోవాలంటే ఆరోగ్యంగా..అందంగా ఉన్న బిడ్డను తీసుకుంటారు. కానీ లోపం ఉందని తెలిసీ ఎవరైనా బిడ్డను దత్తత తీసుకుంటారా? అలా తీసుకున్న తరువాత తమ జీవితాన్నే త్యాగం చేసి తానే తల్లీ దండ్రీ అన్నీఅయి ఆ బిడ్డే లోకంగా జీవించేవాళ్లును ఏమనాలి? త్యాగం అనాలా? త్యాగం అనే మాటే లేదు. ఎందుకంటే ఆ బిడ్డే తన లోకం అయినప్పుడు ఇక వేరే మాటలెందుకు? అంటున్నారు ఆదిత్యా తివారీ అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. 

పిల్లలు పుట్టని మహిళలు బిడ్డల్ని దత్తత తీసుకుంటారు. కానీ ఓ పురుషుడు ఆరోగ్య సమస్యలు ఉన్న పసివాడ్ని దత్తత తీసుకుని ఆ బాబు కోసం వాడి భవిష్యత్తు కోసం తన ఉద్యోగాన్ని మానేసారు ఆదిత్యాతివారీ. అతటి అమ్మతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే  మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ‘వరల్డ్స్‌ బెస్ట్‌ మమ్మీ’ అవార్డు తీసుకోబోతున్నారు ఆదిత్యాతివారీ. 

  
వివరాల్లోకి వెళితే.. ఈయనే ఆ పసివాడికి తల్లి. తల్లి మాత్రమే కాదు. ప్రపంచంలోనే ‘బెస్ట్‌ మమ్మీ’ ఎవరన్నా ఉన్నారు అంటే నిస్సందేహంగా అది అతనే. 2020 మార్చి-8  అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు బెంగళూరులో జరుగుతున్న ‘వెంపవర్‌’ ఈవెంట్‌లో మరికొందరు బెస్ట్‌ మమ్మీలతో పాటు ఈయనా ‘వరల్డ్స్‌ బెస్ట్‌ మమ్మీ’ అవార్డు అందుకోబోతున్నారు. ఆదిత్యా తివారి. మరి ఆ  ‘వరల్డ్స్‌ బెస్ట్‌ మమ్మీ’ అవార్డు తీసుకోనున్న ఆదిత్యా తివారీ మహోన్నత వ్యక్తి గురించి.. 

ఆదిత్యా తివారీది పుణె. అతని కొడుకు పేరు అవ్నీష్‌. నాలుగేళ్ల క్రితం రెండేళ్ల వయసున్న అవ్నీష్‌ని దత్తత తీసుకున్నారు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసేూ ఆదిత్య. అవ్నీష్‌ సంరక్షణ కోసం ఉద్యోగం మానేశాడు. అవ్నీష్‌ స్పెషల్‌ చైల్డ్‌. అంటే ‘డౌన్‌ సిండ్రోమ్‌’ ఉంది. (ఆటిజం) అది తెలిసీ కూడా దత్తత తీసుకున్నారు ఆదిత్య. డౌన్‌ సిండ్రోమ్‌ శారీరకంగానూ, మానసికంగానూ త్వరగా ఎదగనివ్వదు. ఆదిత్య సంరక్షణలో..అతను చూపించే ప్రేమ..వాత్సల్యాలతో  చక్కగా  ఎదుగుతున్నాడు అవ్నీష్‌! ఎంతగా అంటే..హార్ట్ లో హోల్ (గుండెకు రంధ్రం) ఉండే అవ్నీష్ కు ఎటువంటి మందులు వాడకుండానే అది భర్తీ అయింది. అంతేకాదు ఈ స్పెషల్ చైల్డ్ ఇప్పుడు 6 ఏళ్లు. బలెవాడిలోని స్కూల్ కు కూడా వెళ్తున్నాడు. ఆదిత్యా ఎక్కడకు వెళ్లినా కొడుకు కూడా ఉండల్సిందే. అవ్నీష్ లేకుండా ఆదిత్య లేడు. కాలు కూడా కదపడు ఈ సూపర్ మామ్. 

ఆదిత్య గురించి చెప్పటానికి మాటలు చాలవు. సహజంగానే ఆడవాళ్లకు పిల్లల్ని పెంచే లక్షణం ఉంటుందంటారు. కానీ ఆదిత్యా అటువంటి అమ్మలకే కౌన్సెలింగ్ ఇస్తుంటారు. అలా  స్పెషల్ కిడ్స్ ఉండే 10వేల మంది తల్లిదండ్రులకు  కౌన్సెలింగ్ ఇచ్చారు ఆదిత్యా తివారీ. కౌన్సెలింగ్ కోసం..సెమినార్‌లు, వర్క్‌షాపులు, క్లాసులు.. నిర్వహిస్తూ.. ఆదిత్యా, అవ్నీష్ తో కలిసి దేశంలోని 22 రాష్ట్రాల్లో పర్యటించారు. 

ఎక్కడికి వెళ్లినా అవ్నీష్‌ని వెంటబెట్టుకునే వెళ్తారు ఆదిత్య. ఐక్యరాజ్యసమితి నుంచి పిలుపుని అందుకున్నారు. అక్కడకు వెళ్లి ప్రసంగించారు. జెనీవాలో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో కూడా ఆదిత్యా,అవ్నీష్ లు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. అవ్నీష్‌ ఇంకా కొన్ని సర్జరీలేవో చేయించాలి. వాటిని చేయించడానికి తగిన సమయం, వయసు కోసం చూస్తున్నారు ఆదిత్య. అవ్నీష్‌కు  డాన్స్‌ అంటే ఇష్టం. మ్యూజిక్, ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. కొడుకు ఏది ఇష్టమైతే అదే ఆ తండ్రికి ఇష్టం..

అమ్మతనానికి ఇదీ అని నిర్వచనం చెప్పలేం. బిడ్డను నవమాసాలు మోసి కననక్కరలేదు. అమ్మతనంతో అక్కున చేర్చుకుని వారిని ఉన్నతులుగా తీర్చి దిద్దే ప్రతీ ప్రేమ అమ్మతనమే. కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎంతో గొప్పదని పెద్దలు అనుభవ పూర్వకంగా చెప్పారు. బిడ్డపై చూపించే వాత్సల్యాన్ని అమ్మతనం అంటే ఆ ప్రేమను కురిపించేవారు ఆడవారైనా మగవారైనా ఒక్కటే. అదే అమ్మతనం. అటువంటి మహోన్నత వ్యక్తే ఆదిత్యా తివారీ.‘వరల్డ్స్‌ బెస్ట్‌ మమ్మీ’ అవార్డుకు సరైన నిర్వచనం ఆదిత్యాతివారీ అనటంలో ఎటువంటి సందేహం లేదు. మిస్టర్ మామ్..బెస్ట్ మామ్. సూపర్ మామ్ ఇలా ఎన్ని మాటలు చెప్పిన తక్కువే ఆదిత్యా తివారీ విషయంలో. 

See Also | OMG.. 475ఫీట్ల టవర్‌ని 25నిమిషాల్లో ఎక్కేశాడు