Russia vs ukraine war: పుతిన్ భయంకరమైన తప్పు చేస్తున్నాడు.. గుణపాఠం తప్పదు..

యుక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. బాంబుల మోత మోగిస్తుంది. తాజాగా రష్యా సైనికులు డాన్‌బాస్‌ ప్రాంతంలోని బిలోహొరివ్కాలోని ఓ పాఠశాలపై బాంబులు వేయడంతో అందులో..

Russia vs ukraine war: పుతిన్ భయంకరమైన తప్పు చేస్తున్నాడు.. గుణపాఠం తప్పదు..

Canada Prime Ministe

Updated On : May 9, 2022 / 11:52 AM IST

Russia vs ukraine war: యుక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. బాంబుల మోత మోగిస్తుంది. తాజాగా రష్యా సైనికులు డాన్‌బాస్‌ ప్రాంతంలోని బిలోహొరివ్కాలోని ఓ పాఠశాలపై బాంబులు వేయడంతో అందులో తలదాచుకున్న 60మంది మృతిచెందగా, 30 మంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వొచ్చాయి. యుక్రెయిన్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకొనే వరకు రష్యా ప్రధాని పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా యుక్రెయిన్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో పర్యటించారు. ఇర్పిన్ నగరంలో ఆయన పర్యటించి రష్యా సైన్యం దాడులకు ధ్వంసమైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.

Russia Victory Day : విక్టరీ డే సెలబ్రేషన్స్ లో పుతిన్ ఏం ప్రకటించనున్నారు? ఉత్కంఠగా దృష్టి సారించిన ప్రపంచ దేశాలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో యుద్ధంలో ఓడిపోయేలా మాస్కోపై సంవత్సరాల తరబడి ఆంక్షల విధించడం జరుగుతుందన్నారు. యుక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు ప్రపంచమంతా చేయాల్సిందంతా చేస్తుందని తెలిపారు. పుతిన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పశ్చిమ దేశాలు ఖచ్చితంగా నిశ్చయించుకున్నాయని, అతను చేస్తున్న దానికి వ్యతిరేకంగా నిలబడాలని నిర్ణయించుకున్నారని ట్రూడో అన్నారు. పుతిన్ పెద్దతప్పు చేస్తున్నాడని అన్నారు. పుతిన్ చట్టవిరుద్ధమైన యుద్ధం చేస్తున్నాడని, అతను యుక్రెయిన్‌ను ఆక్రమించుకొనే క్రమంలో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడని అన్నారు. ఈ క్రమంలో పుతిన్ ఓటమికి తాము చేయాల్సిందా చేస్తామని ట్రుడో స్పష్టం చేశాడు. కెనడా యుక్రెయిన్‌కు కొత్త ఆయుధాలు, సామగ్రిని అందజేస్తుందని, దేశ రాజధాని కీవ్‌లో తన రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభిస్తుందని ట్రూడో చెప్పాడు.