Donald Trump: నేనే అధికారంలో ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు – ట్రంప్

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఉక్రెయిన్ విష‌యంలో పుతిన్‌ వైఖరి బాగాలేదంటూ అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్‌...

Donald Trump: నేనే అధికారంలో ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు – ట్రంప్

Donald Trump

Donald Trump: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఉక్రెయిన్ విష‌యంలో పుతిన్‌ వైఖరి బాగాలేదంటూ అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్‌, ఆయ‌న అధికార గ‌ణంపై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ర‌ష్యా దాడులు చేయ‌డం అత్యంత పాశ‌విక‌ంగా ఉన్నాయని ఆక్షేపించారు.

ఈ సందర్భంగా క‌న్జ‌ర్వేటివ్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ కాన్ఫ‌ిరెన్స్‌లో ట్రంప్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. అత్యంత భ‌యంక‌ర‌మైన సంఘ‌ట‌న‌గా అభివ‌ర్ణించారు. దాడుల‌ను ఖండిస్తున్న‌ట్లు పేర్కొంటూ.. యుక్రెయిన్‌పై ర‌ష్యా దాడి చేయ‌డం అత్యంత భీతిగొలిపే విష‌యమని, ఇలాంటి దౌర్జ‌న్యం, దుశ్చ‌ర్య‌లు ఎప్ప‌టికీ జ‌ర‌గ‌నేకూడ‌దని వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా యుక్రెయిన్ ప్ర‌జ‌ల యోగ‌క్షేమాల కోసం ప్రార్థ‌న‌లు చేస్తున్నామంటూ అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ తెలిపారు.

Read Also : ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ యాప్ వచ్చేస్తోంది.. ఆపిల్ App Storeలో రేపే లాంచ్..!

భ‌యంక‌ర, భీతిగొలిపే ప‌రిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ చూపిస్తున్న ధైర్యం, తెగువ ఎంతో ప్ర‌శంస‌నీయ‌మ‌ని ట్రంప్ సూచించారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో స‌న్నిహిత సంబంధాలే వున్నాయ‌ని, అధికారంలో ఉన్నట్లయితే ఇలా జ‌రిగేది కాద‌ని ట్రంప్ పున‌రుద్ఘాటించారు.

పుతిన్ త‌బ‌లాను వాయించిన‌ట్లుగా అమెరికా అధ్య‌క్షుడు బిడెన్‌ను వాయించేస్తున్నార‌ని ట్రంప్ ఘాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దొహెట్స్క్‌, లుహాన్స్క్‌ల‌ను స్వ‌తంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తూ పుతిన్ తీసుకున్న నిర్ణ‌యం పుతిన్ మేధ‌స్సుకు నిద‌ర్శ‌న‌మ‌ని అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రింద‌టే తెగ మెచ్చుకున్నారు.