Macaque Monkey : అరుదైన మకాక్ జాతి కోతి పిల్ల.. బ్రిటన్ చెస్టర్ జూలో జననం

అయితే అటవీ క్షయం, వేట కారణంగా ప్రస్తుతం ఆ ఏరియాలో వీటి సంఖ్య 5 వేల కన్నా దిగువకు పడిపోయింది.  దీంతో మకాక్ జాతి కోతుల సంరక్షణకు ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Macaque Monkey : అరుదైన మకాక్ జాతి కోతి పిల్ల.. బ్రిటన్ చెస్టర్ జూలో జననం

Macaque monkey

Updated On : June 4, 2023 / 10:55 AM IST

Britain Chester Zoo : మకాక్ జాతి కోతుల సంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో ఇవి అంతరించిపోతున్న జీవ జాతుల్లో ఒకటిగా చేరిపోయాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ లోని చెస్టర్ జూలో మకాక్ జాతికి చెందిన కోతుల జంటకు ఒక పిల్ల కోతి జన్మించింది. అంతరించిపోతున్న మకాక్ కోతి జాతికి చెందిన ఒక పిల్ల కోతి చెస్టర్ జూలో జన్మించడంతో జూ అధికారులు అనందం వ్యక్తం చేశారు.

తమ జూలో మకాక్ జాతి కోతిపిల్ల జన్మించడం.. మకాక్ జాతి కోతుల సంరక్షణ కోసం చేపట్టిన
గ్లోబల్ బ్రీడింగ్ కార్యక్రమానికి శుభపరిణామమని చెస్టర్ జూ క్షీరదాల విభాగం అధ్యక్షుడు మార్క్ బ్రే షా
తెలిపారు. ఇండోనేషియాలోని సులవేసి ఏరియాలో ఈ మకాక్ జాతి కోతుల ఉనికి అధికంగా ఉంటుంది.

Pakistan : దైవ దూషణ చేశాడని పాకిస్తాన్ లో యువకుడికి మరణ శిక్ష

అయితే అటవీ క్షయం, వేట కారణంగా ప్రస్తుతం ఆ ఏరియాలో వీటి సంఖ్య 5 వేల కన్నా దిగువకు పడిపోయింది.  దీంతో మకాక్ జాతి కోతుల సంరక్షణకు ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బ్రిటన్ లోని చెస్టర్ జూలో మకాక్ కోతి పిల్ల జన్మించడం సంతోషించాల్సిన విషయమని చెప్పవచ్చు.