Russia-Ukraine: యుద్ధం మొదలైంది.. పుతిన్ ఆదేశాలు.. యుక్రెయిన్‌పై బాంబులతో రష్యా దాడి

యుక్రెయిన్‌పై సైనిక చర్యకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. వారి చేతుల్లోని ఆయుధాలు వదిలేయాలని యుక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు.

Russia-Ukraine: యుద్ధం మొదలైంది.. పుతిన్ ఆదేశాలు.. యుక్రెయిన్‌పై బాంబులతో రష్యా దాడి

Russia War

Russia-Ukraine: యుక్రెయిన్‌పై సైనిక చర్యకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. వారి చేతుల్లోని ఆయుధాలు వదిలేయాలని యుక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు. యుక్రెయిన్‌ని కలుపుకునే ఆలోచన మాత్రం రష్యాకు లేదని, సమస్య వచ్చినప్పుడు మాత్రం రష్యా స్పందిస్తుందని పుతిన్ స్పష్టం చేశారు. మరోవైపు యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో పేలుడుకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది.

యుక్రెయిన్ బుధవారం(23 ఫిబ్రవరి 2022) దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించగా.. యుక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది. యుక్రెయిన్‌పై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కావడం ఈ వారంలో ఇది రెండోసారి.

ఇది జరుగుతుండగానే పుతిన్ ప్రకటన తర్వాత యుక్రెయిన్‌లో పలు నగరాలపై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. యుక్రెయిన్‌పై దండెత్తేందుకు రష్యా సిద్ధమైన క్రమంలోనే యుక్రెయిన్‌లోని తమ దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించింది రష్యా. మరోవైపు తమపై విధించిన ఆంక్షలకు అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని రష్యా హెచ్చరిస్తోంది. మరోవైపు యుక్రెయిన్​కూడా రష్యాలోని తమ పౌరులను వెనక్కి రావాలని ప్రకటించింది.

పశ్చిమ దేశాలు ఆంక్షల కొరఢా ఝుళిపిస్తున్నా రష్యా వెనక్కి తగ్గడం లేదు. యుక్రెయిన్‌ సరిహద్దుల వెంబడి కొత్తగా.. అదనపు బలగాలతో మోహరించి యుద్ధం చేస్తోంది. యుక్రెయిన్ సరిహద్దుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్‌గొరొడ్ నైరుతి ప్రాంతంలో సైనికులు, ఆయుధ వ్యవస్థలను మోహరించి దాడులు చేస్తోంది.