Russia Ukraine War: చదువు కోసం భారత్ నుంచి యుక్రెయిన్‌కే ఎందుకు.. ఇప్పుడెలా

వరుసగా ఆరు రోజులుగా దాడి చేస్తున్న రష్యా.. చిన్న దేశమైనా తగ్గేదేలెమ్మంటూ పోరాడుతున్న యుక్రెయిన్.. ఆత్మాభిమానమో, అహంభావమో ఇరు దేశాల మధ్య చర్యలు కూడా విఫలం అవడంతో దాడులు కొనసాగుతూనే.

Russia Ukraine War: చదువు కోసం భారత్ నుంచి యుక్రెయిన్‌కే ఎందుకు.. ఇప్పుడెలా

Ukraine Mbbs

Russia Ukraine War: వరుసగా ఆరు రోజులుగా దాడి చేస్తున్న రష్యా.. చిన్న దేశమైనా తగ్గేదేలెమ్మంటూ పోరాడుతున్న యుక్రెయిన్.. ఆత్మాభిమానమో, అహంభావమో ఇరు దేశాల మధ్య చర్యలు కూడా విఫలం అవడంతో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, ఈ దాడుల్లో ఇండియన్ స్టూడెంట్లు నష్టపోతుండటం, భారత ప్రభుత్వం వారిని తీసుకొచ్చేందుకు నానా తంటాలు పడటం వెనుక అసలు కథ ఏంటి.

ఇండియా నుంచి అక్కడి వెళ్లి చదువుకోవడానికి కారణమేమై ఉండొచ్చు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అనే సందేహాలు రాకమానవు.

ఇండియన్ స్టూడెంట్లు యుక్రెయిన్ చదువు కోసం ఆసక్తి చూపించడానికి అసలు కారణం. తక్కువ ధరతో ఎంబీబీఎస్ చదువు పూర్తి అయిపోతుండటం. అంతేకాకుండా హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ మనోళ్లను బాగా అట్రాక్ట్ చేస్తుంది.

2020లో ఇండియా నుంచి యుక్రెయిన్ లో చదువుకోవడానికి వెళ్లిన విదేశీ విద్యార్థులలో 24శాతం మంది ఇండియన్లేనని యుక్రెయిన్ విద్యాశాఖ వెల్లడించింది. అసలు యుక్రెయిన్ చదువుకోవడానికి వెళ్లే వాళ్లలో ఇండియాతో పాటు మొరాకో, టర్క్‌మెనిస్తాన్, అజెర్‌బైజన్, నైజీరియా, చైనా, టర్కీ, ఈజిప్ట్, ఇజ్రాయెల్, ఉజ్బెకిస్తాన్ లు టాప్ 10దేశాల జాబితాలో ఉన్నాయి.

Read Also : కాక్ టెయిల్ బాంబులు తయారు చేస్తున్న బీర్ల ఫ్యాక్టరీ

రీసెంట్ గా ఇండియన్ ఎంబస్సీ 18వేల మంది భారతీయులు మెడికల్ లేదా ఇంజినీరింగ్ చదవడానికి యుక్రెయిన్ వచ్చారని వెల్లడించింది.

కేవలం సంవత్సరానికి రూ.2.65 లక్షల నుంచి రూ.3.8లక్షల్లో మెడిసిన్ పూర్తయిపోతుండటంతో యుక్రెయిన్ మెడిసిన్ ఎడ్యుకేషన్ ఇంట్రస్ట్ పెంచింది. పైగా అక్కడ మెడికల్ యూనివర్సిటీలు అడ్మిషన్ కోసం ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ కూడా నిర్వహించవు. క్లాసులు కూడా ఇంగ్లీషులోనే చెప్పడంతో విదేశీ భాష నేర్చుకోవాల్సిన అవసరమే లేదు.