Russia-Ukraine War: రష్యా బలగాలపై ప్రతిదాడికి యుక్రెయిన్‌కు 6వేల యూకే మిస్సైల్స్

యుక్రెయిన్ కోసం 6వేల డిఫెన్సివ్ మిస్సైల్స్ ను రెడీ చేస్తుంది బ్రిటన్. దాదాపు 13వేల క్వింటాళ్ల బరువుండే రూ.306కోట్ల విలువైన మిస్సైల్స్‌ను పంపించనున్నట్లు సమాచారం.

Russia-Ukraine War: రష్యా బలగాలపై ప్రతిదాడికి యుక్రెయిన్‌కు 6వేల యూకే మిస్సైల్స్

Russia Ukraine War

Russia-Ukraine War: యుక్రెయిన్ కోసం 6వేల డిఫెన్సివ్ మిస్సైల్స్ ను రెడీ చేస్తుంది బ్రిటన్. దాదాపు 13వేల క్వింటాళ్ల బరువుండే రూ.306కోట్ల విలువైన మిస్సైల్స్‌ను పంపించనున్నట్లు సమాచారం. గురువారం జరగనున్న నాటో, జీ7 లీడర్స్ మీటింగ్స్ లో బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ యుక్రెయిన్ కోసం కొత్త ప్యాకేజిని ప్రకటించే యోచనలో ఉన్నారట.

ప్యాకేజిలో భాగంగా 6వేల మిస్సైల్స్, 25మిలియన్ పౌండ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ యుక్రెయిన్ మిలటరీకి ఇవ్వనున్నారు. అంతేకాకుండా బీబీసీ వరల్డ్ సర్వీస్ కు కూడా 4.1 మిలియన్ పౌండ్స్ హెల్ప్ సపోర్ట్, రష్యా లాంగ్వేజ్ సర్వీసెస్‌కు కూడా అందజేస్తామని చెప్పారు.

‘యూకే.. మా మిత్ర దేశాలతో పనిచేస్తుంది. యుక్రెయిన్ కు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తుంది. డిఫెన్స్ బలగాలకు సామర్థ్యం చేకూరుస్తాం. గట్టిగా పోరాడతాం. నెల రోజులుగా ఈ సంక్షోభం కనిపిస్తుంది. యుక్రెయిన్ ఫ్రీడమ్ తో బతికేలా శ్రమిస్తాం. ఇలాగే చూస్తూ ఉంటే ఐరోపానే కాదు ప్రపంచమంతా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది’ అని జాన్సన్ వెల్లడించారు.

Read Also : రష్యాకు బిగ్‌లాస్ .. 15,300 మంది సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ వెల్లడి

బ్రిటన్ తీసుకున్న కొత్త కమిట్మెంట్ తో యుక్రెయిన్ కు 10వేల మిస్సైల్స్, అదనపు నిధులు చేకూరనున్నాయని అంటున్నారు. గురువారం నాటో సమ్మిట్ లో భాగంగా యుక్రెయిన్ సంరక్షణ కోసం సాయం చేసేందుకు చర్చలు జరగనున్నాయి.