Russia Govt: ఐఫోన్ వదిలేయండి.. AYYA T1ని వాడండి

యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ యాపిల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్ కంపెనీలు తమ ఉత్పత్తులను, సర్వీసులను రష్యాలో పూర్తిగా నిలిపేసింది.

Russia Govt: ఐఫోన్ వదిలేయండి.. AYYA T1ని వాడండి

Ayya T1

Russia Govt: యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ యాపిల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్ కంపెనీలు తమ ఉత్పత్తులను, సర్వీసులను రష్యాలో పూర్తిగా నిలిపేసింది. తాజాగా రష్యాగా యాపిల్ ప్రొడక్ట్స్ కు ధీటుగా కొత్త ఫోన్ ను తీసుకురానుంది. దేశ పౌరుల కోసం స్వదేశీ స్మార్ట్ ఫోన్ ‘AYYA T1’ను తీసుకొస్తున్నట్లు రష్యా వెల్లడించింది.

ఈ స్మార్ట్ ఫోన్లను స్కేల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అనుబంధ సంస్థ స్మార్ట్ ఇకో సిస్టమ్ కంపెనీ అభివృద్ధి చేస్తోందని తెలిపింది. ఐఫోన్లకు బదులు AYYA T1 స్మార్ట్ ఫోన్లను ఉపయోగించాలని తమ దేశీయులను రష్యా కోరడం గమనార్హం.

అత్యంత నమ్మదగిన ఫోన్ అని రష్యన్ స్టేట్ డూమా సభ్యులు మరియా బూటినా, డెనిస్ మైదానోవ్ తమ దేశపౌరులకు సూచించారు. యూజర్స్ పై ఇతరులు నిఘా పెట్టకుండా ఉండటానికి కెమెరాలు, మైక్రోఫోన్ ను టర్న్ ఆఫ్ చేసేలా ప్రత్యేక హార్డ్ వేర్ బటన్ తీసుకురానున్నారట. దీని ధర సుమారుగా 15నుంచి 19వేల రూబెల్స్ మధ్య ఉండొచ్చని అంచనా.

Read Also : రష్యాకు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్‌, టిక్‌టాక్‌.. పూర్తి సర్వీసులు బంద్..!

దీని ఫీచర్లు
* మీడియాటెక్ హిలీయో పీ70 ప్రొసెసర్
* 6.5 అంగుళాల డిస్ ప్లే స్క్రీన్
* 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజి
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 12ఎంపీ, 5ఎంపీ కెమెరాలు
* ఆండ్రాయిడ్ 11ఓఎస్