Ukraine – Russia : ఉక్రెయిన్‌‌కు మూడు వైపులా రష్యా సైనిక బలగాలు.. శాటిలైట్ చిత్రాలు

ఉక్రెయిన్‌ నుంచి గతంలో ఆక్రమించుకున్న క్రిమియా, పశ్చిమ రష్యా, బెలారస్ ప్రాంతాల్లో రష్యా బలగాలను మోహరించిన శాటిలైట్ చిత్రాలను అమెరికా విడుదల చేసింది...

Ukraine – Russia : ఉక్రెయిన్‌‌కు మూడు వైపులా రష్యా సైనిక బలగాలు.. శాటిలైట్ చిత్రాలు

Russia

Russian Military : ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. భారీగా సైన్యాన్ని రష్యా మోహరిస్తోందని ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. వేలాదిగా సైనికులు, ఆయుధాలు, శతఘ్నులను రష్యా మోహరించిందని ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. క్రిమియా, పశ్చిమ రష్యా, బెలారస్ లలో సైనికులను సమీకరిస్తోంది. ఈ విషయాన్ని సీనియర్ డైరెక్టర్ స్టీఫెన్ వుడ్ వెల్లడించారు. 550 కంటే ఎక్కువగా టెంట్లు, వందలాది వాహనాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నాయని మాక్సర్ అంచనా వేసింది. క్రిమియాలో కూడా విస్తృతంగా ఫిరింగిలున్నాయని, నోవోజెర్నోయోలో దళాలున్నాయని వెల్లడిస్తోంది.

Maxar

క్రిమియా వాయువ్య తీరంలో స్లావ్నే పట్టణానికి సమీపంలో పరిణామాలు మారిపోతున్నాయని మాక్సర్ గుర్తించింది. సెవాస్టోపోల్ వద్దనున్న ప్రధాన నౌకాశ్రయం వద్దకు యుద్ధ నౌకలు, ల్యాండింగ్ నౌకలు చేరుకున్నాయి. బెలారస్ – ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 15 మైళ్ల దూరంలో ఉన్న గోమెల్ నగరానికి సమీపంలో ఉన్న Zyabrovka ఎయిర్ ఫీల్డ్ సేనలు, సైనికులకు చెందిన వాహనాలు, హెలికాప్టర్ లున్నాయని మాక్సర్ గుర్తించింది. ఈ ప్రాంతంలో హెలికాప్టర్లు కనిపించడం ఇదే తొలిసారి అని వెల్లడిస్తున్నారు. దీనికి అదనంగా ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 30 మైళ్లకంటే తక్కువ దూరంలో ఉన్న Belarusian నగరమైన Rechitsaలో యుద్ధ బృందాలు మోహరించాయని ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. రెచిట్సా సమీపంలో సైనికులు డేరాలను ఏర్పాటు చేసుకున్నట్లు చూపిస్తున్నాయి.

Russia Milatry

రష్యన్ దేశానికి చెందిన సైనిక బలగాలు కదలికలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇక దీనిపై అమెరికా ఆందోళన చెందుతోంది. లక్షా 30వేలకు పైగా బలగాలను ఉక్రెయిన్ మూడు వైపులా రష్యా మోహరించడమే ఆందోళనలకు కారణం. మిత్రదేశం బెలారస్‌తో కలిసి రష్యా బలగాలు డ్రిల్స్ కూడా నిర్వహిస్తోంది. ఉక్రెయిన్‌ నుంచి గతంలో ఆక్రమించుకున్న క్రిమియా, పశ్చిమ రష్యా, బెలారస్ ప్రాంతాల్లో రష్యా బలగాలను మోహరించిన శాటిలైట్ చిత్రాలను అమెరికా విడుదల చేసింది. క్రిమియా రాజధాని ఒక్త్యాబర్‌స్కోయే సహా ఇతర ప్రాంతాల్లో భారీ బలగాలు, యుద్ధ సామాగ్రి ఉన్నాయి.

ఇప్పటికే రష్యా యుద్ధనౌకలు, ల్యాండింగ్ నౌకలు, క్రిమియాలో ప్రధాన ప్రాంతానికి చేరుకున్నాయి. బెలారస్‌ వైపు భారీగా బలగాలు, మిలటరీ వాహనాలు, హెలికాప్టర్లు తరలివెళ్లాయి. ఆ ప్రాంతంలో యుద్ధ హెలికాప్టర్లు కనిపించడం ఇదే తొలిసారి. రష్యా, బెలారస్ సంయుక్త బలగాలు సరిహద్దుల వెంబడి 200 మైళ్ల దూరం వెంబడి విన్యాసాలు జరిపాయి. ప్రస్తుతం పరిణామాలు, ఫలితాలు ఎలా ఉంటాయన్నది రానున్న రోజుల్లో తేలనుంది.