Ukraine : ఉపగ్రహ చిత్రాలతో రష్యా నరమేధం తేటతెల్లం.. మాకేం సంబంధం అంటూ బుకాయింపు

ఉక్రెయిన్ లోని బుచా వీధుల్లో రష్యా సైన్యం సృష్టించిన నరమేధం అంతాఇంతా కాదు.. ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి. ఇంతంటి దారుణానికి పాల్పడిన రష్యా తీరుపై ప్రపంచ దేశాలు ..

Ukraine : ఉపగ్రహ చిత్రాలతో రష్యా నరమేధం తేటతెల్లం.. మాకేం సంబంధం అంటూ బుకాయింపు

Russia Ukraine

ukraine : ఉక్రెయిన్ లోని బుచా వీధుల్లో రష్యా సైన్యం సృష్టించిన నరమేధం అంతాఇంతా కాదు.. ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి. ఇంతంటి దారుణానికి పాల్పడిన రష్యా తీరుపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. పుతిన్ సేన సృష్టించిన మారణహోమం నాగరిక సమాజం జీర్ణించుకోలేక పోతోంది. గత నెల 30న బుచా వీధుల్లో రష్యా సైన్యం అకృత్యాలను మాక్సర్ ఉపగ్రహం రూపంలో ప్రపంచ ప్రజల కళ్లముందుకు వచ్చాయి.

Russia-Ukraine war: రష్యాకు భారీ షాక్.. హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ నుంచి తొలగించిన ఐరాస

మాక్సర్ ఉపగ్రహాలు బుచా వీధుల్లో మార్చి 30న రష్యన్ సైనికులు సృష్టించిన బీభత్సంతో చెల్లాచెదరుగా పడినటువంటి మృతదేహాలను చిత్రించాయి. ఈ క్రమంలో మార్చి 31న తీసిన మరో చిత్రంలో బుచాలోని చర్చి మైదానంలో సామూహిక సమాధి ఉండే అవకాశం ఉందని చూపించింది. ఈ చిత్రలో దాదాపు 45 అడుగుల కందకం ఉంది. మార్చి 10న తీసిన చిత్రం కందకం తవ్వడానికి ప్రారంభంలా కనిపిస్తోంది.
ఒక ఉపగ్రహ చిత్రం మార్చి 31న సామూహిక సమాధి ఉన్న ప్రదేశంతో పాటు సెయింట్ ఆండ్రూ యొక్క బుచా చర్చ్‌ను చూపుతుంది.

russia ukraine war : రష్యాపై ఆంక్షలు కఠినతరం.. టార్గెట్ పుతిన్ డాటర్స్..

అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం తమకు ఉక్రెయిన్ లో చెల్లా చెదురుగా ఉన్న మృతదేహాలతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఏప్రిల్ 3న రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన టెలిగ్రామ్ పోస్టులో హత్యలకు బాధ్యతను నిరాకరించింది. తమ సైన్యం మార్చి 30 నాటికి ఉక్రెయిన్ నుంచి వెనుదిరిగినట్లు పేర్కొంది.