Shark Fish : షికారుకు వెళ్లి..షార్క్‌తో పరాచికాలా? చుక్కలు చూపెట్టిందిగా..
సముద్రంలో షార్క్‌తో పరాచికాలా? చుక్కలు చూపెట్టిందిగా..అనేలా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది.

Shark Bite By Man
Shark Bite By Man : స్థానబలిమి కాని తన బల్మి కాదయా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన చెప్పిన నీతి ఏకాలంలో అయినా..ఎటువంటి పరిస్థితులో అయినా వర్తిస్తుంది అనటానికి మరో ఘటన ఉదాహరణగా నిలిచింది. సముద్రంలోను పైగా నాతో పరాచికాలు ఆడితే ఏ జరుగుతుందో ఓ వ్యక్తికి రుచి చూపించిందో షార్క్ చేప. షార్క్ చేపతో ఓవరాక్షన్‌కు పోయి గాయాలపాలైయ్యాడు ఓ వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సముద్రంలోని ఓ పడవలో ఒక ఫ్యామిలీ పర్యటిస్తోంది. సముద్రంలో ఓ చిన్న సొరచేప(షార్క్)ను నీటిలో వదిలే క్రమంలో ఓ వ్యక్తి ఓవర్ యాక్షన్ చేశాడు. చేపను గట్టిగా నీటిలో అటు ఇటు తిప్పాడు. దీంతో..షార్క్ కు తిక్కరేగింది. నాకే ఈతలు నేర్పుతావా? అన్నట్లుగా తన వాడిగల పళ్లతో అతడిని ఠక్కున పట్టేసుకుంది. దాన్నుంచి విడిపించుకోవటానికి అతగాడి పాట్లు చూడాలి..అతని చేతిని షార్క్ కొరికే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో అతడి వేలుకు తీవ్రగాయమైంది. చేతి నుంచి రక్తం కారింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
we would’ve had shark steaks the same night ? pic.twitter.com/GDKZCCUgTC
— SourPatchB? (@ButtahCuupB) July 20, 2022